Thursday, January 23, 2025

గిరిజనులకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట : సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ గిరిజనోత్సవం హయత్‌నగర్ బంజారా కాలనీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తుందని పోడు భూములకు పట్టాలు, పెరిగిన జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్‌లు 6 శాతం నుండి 10 శాతం వరకు పెంచడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు వల్ల గణనీయమైన మార్పుకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు ద్వార గిరిజనులకు సమగ్ర వికసానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్‌గుప్త, ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ మారుతి దివాకర్, మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి, డివిజన్ పార్టీ ఆధ్యక్షుడు చేన్నగోని శ్రీధర్‌గౌడ్, సినియర్ నాయకులు కుంట్లూర్ వెంకటేశ్‌గౌడ్, నక్క రవీందర్‌గౌడ్, భాస్కర్ సాగర్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News