Monday, December 23, 2024

తెలంగాణలో రానున్నది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఎక్కడలేని విధంగా రైతు సంక్షేమమే లక్షంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌పై చేసిన వాక్యలను నిరసిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన నిరసన పిలుపులో భాగంగా గురువారం మండలంలోని వావిలాల రైతువేదిక భవనంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని రైతులు ఎదుర్కొన్న సమస్యలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు రైతులకు సాగు కోసం 24గంటల ఉచిత విద్యుత్, రైతుభీమా, రైతుబంధు పథకాలతో పాటు 2పంటలకు సాగునీటిని అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

రైతును రాజును చేయాలనుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనో, సాగుకు 3గంటలు విద్యుత్ ఇస్తానన్న రేవంత్ కావాలనో మీరే ఆలోచన చేయాలన్నారు. నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి, ఒక్కసారి అవకాశం కల్పిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ, సహాకారంతో నియోజకవర్గాన్ని సిద్దిపేట పట్టణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.

కాంగ్రేస్, బీజేపీ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసిన రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఏదీ ఏమైన, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసిన రాష్ట్రంలో రానున్నది కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ పార్టీయే, హుజురాబాద్ గడ్డపై గులాభిజెండా ఎగురవేయడం ఖాయం అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, సర్పంచ్‌లె వెంకట్‌రెడ్డి, శ్రీలత, పద్మ, రాజకొమురయ్య, మహేందర్, ఎంపీటీసీ మల్లేశం, కో-ఆప్షన్ సభ్యుడు రఫీ, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు లింగారావు, వివిధ గ్రామాలకు చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, వావిలాల క్లస్టర్ పరిధిలోని నగురం, నాగారం, వావిలాల, పాపక్కపల్లి గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News