Thursday, January 23, 2025

రాబోయేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే : మంత్రి మల్లారెడ్డి 

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ముఖ్యమంత్రిగా కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్‌ఎస్ ప్రెసిడెంట్ భాషవోని కొండల్ ముదిరాజు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు, నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కెసిఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని, నేడు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్నారని అన్నారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై యువత పార్టీలో చేరుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని మంత్రి సూచించారు. యువ నాయకులు బి.నితిన్ ముదిరాజు, భూషణ్, తిరుపతి, శంకర్, అజయ్, భార్గవి, జీవిత, జానకి, వర్షత తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ ఇంఛార్జి చామకూర మహేందర్‌రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి, నగర మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News