Monday, January 20, 2025

పేదల అభ్యున్నతికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతర కృషి

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్: దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు అమలు పరుస్తు, రాష్ట్ర ప్రజల అభ్యున్నతకి ముఖ్యమం త్రి కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్యక్షు డు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఫరిధీలోని 217 మంది లబ్దాదారులకు 59 జీఓ క్రింద అమలైన పట్టాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభ్యున్నతకి బిఆర్‌ఎస్ ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలు అమలుకు అహర్నిషలు కృషి చేస్తున్నట్లు వివరించారు. మహిళలకు షాధీముబారక్, కళ్యాణలక్ష్మి, వృద్ధ్దాప్యం, వితంతు పేన్షన్‌లు, కెసిఆర్ కిట్‌లు, రైతులకు రైతు బందు, రైతు బీమా ఈ విధంగా దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధ్దికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్న ట్లు పెర్కోన్నారు. మున్సిపాలిటీలోని ఇంజాపూర్ 10, మన్నేగూడ 18, మునుగనూర్ 57, కోహెడ 3, తొర్రూర్ 79, తుర్కయంజాల్ 50 పురపాలికలో మొత్తం 217 మంది లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్‌డిఓ వెంకట చారీ, అబ్దుల్లాపూర్ మెట్ మండల తహాశీల్దార్ అనితరెడ్డి, ర ంగారెడ్డి జిల్లా డిసిసిబీ వైస్ ఛై ర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వం గేటి లకా్ష్మరెడ్డి, కౌన్సిలర్‌లు వేముల స్వాతి, తాళ్లపల్లి సంగీత, క ళ్యాణ్‌నాయక్,మున్సిపాలిటీ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల అ మరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News