Monday, December 23, 2024

దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ సిటీ: బిఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ లింబాద్రికి దళిత రత్న అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు ద్వారా దళితుల జీవితాలలో వెలుగులు నింపారని అన్నారు.

తెలంగాణ ప్రగతికి చిహ్నంగా నూతన సచివాలయానికి భారతదేశ దార్శనికుడు బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం జరిగిందని, ఇదే ఆయనకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చే సముచితమైన గౌరవమన్నారు. హైదరాబాద్ నడిఒడ్డున 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. దళిత విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, విదేశాలలో చదువుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బిఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నామని అన్నారు. నిజామాబాద్ బిడ్డ ప్రొఫెసర్ లింబాద్రి విద్యా మండలి చైర్మన్‌గా నియామకం కావడం జిల్లాకే గర్వకారణమన్నారు.

దళిత రత్న అవార్డు పొందిన నాయకులు మరింత నిబద్ధతతో పనిచేసి సమాజ సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని అలాంటి నాయకుని పాలనలో మనం ఉండటం అదృష్టమన్నారు. దళిత సోదరులంతా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని బిగాల కోరారు. నగరంలోని న్యాల్‌కల్ రోడ్‌లో మాదిగ సంఘం భవన నిర్మాణం కోసం 7లక్షల 20వేల రూపాయలను ఎమ్మెల్యే కోటా కింద సిడిపి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నగర మేయర్ దండు నీతూకిరణ్, మాజీ ఎమ్మెల్సీ రాజశ్వర్, నాంపల్లి పాపన్న, బంగారు నవనీత, సుడా డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, దండు శేఖర్, బాబురావు, బట్టు రాఘవేందర్, ముత్యాలు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News