Saturday, January 11, 2025

గిరిజనుల అభివృద్ధ్దికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

- Advertisement -
- Advertisement -

కుబీర్ : గిరిజనుల అభివృద్ధ్ది కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ్ద చూపతున్నారని నిర్మల్ జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షులు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బ్రహ్మేశ్వర్ తండా బెల్‌గాం తాండా, పల్సి తాండ గ్రామాలను పర్యటించి ఆ గ్రామాలలో ఐటిడిఎ నిధులు రూ.20 లక్షలు చొప్పున నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్కుతుంది. అని పరిపాలన వ్యవస్థను తాండలలోకి తెచ్చి తాండాల యొక్కల రూపు రేఖలను మార్చేశారన్నారు. గిరిజనులు అభివృద్ధ్ది కోసం గిరి వికాస్ పథకం ద్వారా గిరిజన అభివృద్ధ్దికి పాటుపడుతున్నామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తూము లక్ష్మీ రాజేశ్వర్, మాజీ జడ్పిటిసి శంకర్ చౌహన్, తహసీల్దార్ విశ్వంబర్, ఎంపిడివో లింబాద్రి, ఎంఈవో చంద్రకాంత్, ఎంపివో కవిరాజ్, మండల కోఆప్షన్ సభ్యులు దత్త హరి పటేల్, బ్రహ్మేశ్వర్ తాండా సర్పంచ్ దత్తురాం, ఎంపిటిసి శ్యాంరావు, బెల్‌గాం తాండా సర్పంచ్ శాంతాబాయి, అనిల్, ఎంపిటిసి బిజ్జుబాయి, శ్యాంరావు, పల్సి తండా సర్పంచ్ తిథిలిబాయి, ఎంపిటిసి కొట్టె రాజమణి హన్మండ్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వసంత్, బాల ఆనంద్, మార్కెట్ కమిటీ మాజీ ఏఎంసీ చైర్మెన్ దిగంబర్ పటేల్, ఎస్టీ సెల్ అద్యక్షులు సాహెబ్‌రావు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News