Monday, December 23, 2024

అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్: అభివృద్ధ్ది ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తు పనిచేస్తున్న ప్రభుత్వం బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అ న్నారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని స్వర్ణధామనగర్ కమాన్ 39.50, ఆర్.ఆర్‌నగర్ 34.20, వల్లభ్‌నగర్ 19.80, అలీకాంప్లెక్స్ 7.50, హస్మత్‌పేట్ ఫాతిమామజీద్ 36.00 లక్షల రూపాయలు నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కార్పొరేటర్ ముద్దం నర్సింహ్మయాదవ్ బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే 95 శాతం పనులను పూర్తి చేసామని అక్కడక్కడ అసంపూర్తిగా మిగిలి ఉన్న పనులను సైతం పూర్తి చేస్తామని అభివృద్ధ్ది సంక్షేమానికి పెద్ద పీట వేస్తు అందరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం బిఅర్‌ఎస్ ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయని అభివృద్ది 10 సంవత్సరాలో కాలంలో కెసిఅర్ ప్రభుత్వం చేసి చూపెడుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో బిఅర్‌ఎస్‌నేతలు జి.నరేందర్‌గౌడ్, కర్రెజంగయ్య, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, కార్యదర్శి మేకల హరినాధ్, సయ్యద్‌ఎజాజ్,బాల్‌రాజ్, ఉదయ్, బుర్రియాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News