Monday, December 23, 2024

రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

సంగెం: ఎవరెన్ని కుట్రలు చేసినా.. ప్రతిపక్షాలు తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండలోని నివాసంలో సంగెం మండలంలోని పలు గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణను సాధించిన కేసీఆర్ సీఎం అయ్యాకే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దేశానికే ఆదర్శంగా నిలించిందన్నారు. సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును ప్రజలు మెచ్చారని, ఇంత జనరంజకంగా ప్రజోపయోగంగా పరిపాలన చేసిన సీఎంలు గతంలో రాలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మళ్లీ రావాలని, ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నాపై నమ్మకంతో మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంగెం తహసీల్దారు రాజ్‌కుమార్, జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సారంగపాణి, ఆర్‌ఎస్‌ఎస్ మండలాధ్యక్షుడు నరహరి, సాగర్‌రెడ్డి, వీరేశం, శ్రీనివాస్‌తోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News