Monday, December 23, 2024

సర్కార్ విద్యకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం జీవం పోస్తుంది : మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్: సర్కార్ విద్యకు బీఆర్‌ఎస్ పార్టీ జీవం పోస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యాదినోత్సం సందర్భం గా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలల నిర్వహించిన వేడుకలలో మంత్రి మల్లారెడ్డితోపాటు నగర పాలక సం స్థ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, గ్రంథలయ సంస్థ చైర్మన్ దర్గా దయకార్ రెడ్డిలు పాల్గొన్నారు.సుమారు రూ.65 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు.అదే విధంగా విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా శానిటరీ వెండింగ్ మిషన్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్కార్ విద్యకు ప్రభుత్వం కోట్లాది నిధులు వెచ్చించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించిందన్నారు. అవసరమున్న చోట్ల కొత్త తరగతి గదులు, అదనపు గదులు నిర్మించి బోధనా పద్దతుల్లోనూ అనేక మార్పులు చేసిందన్నారు.కేటీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా గరుకులాలను నెలికొల్పిందన్నారు. మన ఊరు, మన -మన బడి, మన బస్తీ కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయని అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న మేయర్ కు పాలకమండలికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వంశీ కృష్ణ , కార్పొరేటర్లు , నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News