Wednesday, January 22, 2025

పదేళ్లలో వాతలే..వాతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గడిచిన ప దేండ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛా ర్జీల పెంపుతో రాష్ట్రంలోని అన్ని వర్గాలపై మోయలేనంత భారం మోపింది. మరోవైపు విద్యుత్తు సంస్థల లాభనష్టాలను వెల్లడించకుండా గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని దెబ్బతీసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. గత ప్రభుత్వం తీసుకున్న ని ర్ణయాల వల్లే రాష్ట్రంలోని డిస్కంలు వేల కో ట్ల అప్పు ల్లో కూరుకుపోయాయన్న విమర్శ లు వినిపిస్తున్నాయి.పదేండ్లలో గత ప్రభుత్వం పెం చిన విద్యుత్ ఛార్జీల భారం రూ.20 వేల కోట్ల పైచిలుకుగా తేలింది. 2015 16లో డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, అన్ని కేటగిరీల నుంచి విద్యుత్ ఛార్జీల ద్వారా రా ష్ట్రంలోని డిస్కంలు (ఎన్పీడిసిఎల్, ఎస్పీడిసిఎల్) రూ. 18,845 కోట్లు వసూలు చేయ గా, 2023 24లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి విద్యుత్ ఛార్జీల ద్వారా డిస్కంలకు వచ్చిన రాబడి రూ. 43,439 కోట్లు మాత్ర మే. ఈ లెక్కన పదేండ్లలో అన్ని వర్గాలపై అప్పటి ప్రభుత్వం వడ్డించిన వి ద్యుత్ ఛార్జీ ల భారం రూ. 24,594 కోట్లు అని తేలిం ది.2015-16 సంవత్సరంలో గత ప్రభు త్వం 5 శాతం విద్యుత్ ఛార్జీల భా రాన్ని మోపగా, 2016-,17లో అంతకంటే ఎక్కువగా 8 శాతం ఛార్జీలను పెంచింది. 2022-23 సంవత్సరంలో ఒకేసారి 16 శాతం ఛార్జీలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెం చింది. వినియోగదారులపై రూ. 6 వేల కో ట్లకుపైగా భారం మోపింది. 2020కి ముం దు ఫిక్స్‌డ్ ఛార్జీల ప్రస్తావన లేకుండానే గృహ వినియోగదారుల నుంచి ఫిక్స్‌డ్ ఛార్జీలను గత ప్రభుత్వం వసూలు చేసింది.

అ నంతరం అయిదేళ్లు ఛార్జీలు పెంచలేదం టూ ప్రజలను నమ్మించిన బిఆర్‌ఎస్ ప్రభు త్వం అడపాదడపా ఛార్జీలను పెంచి ప్రజలను మోసం చేసింది. పేదలను, మధ్య తరగతి ప్రజలను ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలి పెట్టకుండా గత ప్రభుత్వం ఒక్కో యూనిట్ పై రూ.50 పైసల నుంచి ఒక రూపాయి చొప్పున వడ్డించింది. వీటితో పాటు ఫిక్స్‌డ్ కస్టమర్ ఛార్జీలను కూడా పెంచింది. ఆ స మయంలో వినియోగదారుల నుంచి వచ్చి న నిరసనలను బిఆర్‌ఎస్ పెడచెవిన పెట్టిం ది. ఏడాదికోసారి డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సిన వార్షిక ఆదాయ అవసరాల ని వేదికలను (ఏఆర్‌ఆర్)ను కూడా గత ప్ర భుత్వం పట్టించుకోలేదు. దీంతో 2014-15, 201920, 202021, 202122 సంవత్సరాల్లో డిస్కంలు ఈ నివేదికలను (ఏఆర్‌ఆర్) కూడా దాఖలు చేయలేదు. త మ ప్రభుత్వ నిర్వాకాన్ని దాచిపెట్టి ఈ ప్ర భుత్వం రూ.18 వేల కోట్ల ఛార్జీలు పెంచుతుందని

బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ తప్పుడు ప్రచారం చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఛార్జీలను పెంచలేదు. డి స్కంలు ప్రతిపాదించిన రూ.1,200 కోట్ల ఛార్జీల పెంపు భారం కూడా వి నియోగదారులపై పడకుండా ప్రభుత్వమే సబ్సిడీ మొత్తం భరించేందు కు సిద్ధపడడం విశేషం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీలను పెంచకపోగా గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే గృహాలకు ఉచితంగా విద్యుత్‌ను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండడంతో పాటుదాదాపు 50లక్షల గృహాలకు జీరో బిల్లులనుసైతం జారీ చేస్తొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News