Thursday, January 23, 2025

ఇక బిఆర్‌ఎస్సే కీలకం

- Advertisement -
- Advertisement -

జాతీయస్థాయిలో మరింత బలపడుతుంది
ఆ ప్రభావం వచ్చే పార్లమెంటులో స్పష్టంగా
కనిపిస్తుంది మోడీ వైఫల్యాలను ఎండగట్టే ధైర్యం
కెసిఆర్ సొంతం కర్నాటక రాష్ట్ర తెలంగాణ
అసోసియేషన్ ప్రతినిధులతో మాజీ ప్రధాని,
జెడిఎస్ సీనియర్ నాయకుడు దేవెగౌడ

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)కి మంచి భవిష్యత్ ఉందని మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ అన్నారు. రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ మరిం త శక్తిమంతంగా మారడంతో పాటు, కీలకపాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్ప ష్టంగా కనిపించనుందన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని రంగా ల్లో విఫలమైందని, ఈ విషయాన్ని దేశ ప్రజలకు విపులంగా చెప్పే ధై ర్యం తెలంగాణ కెసిఆర్‌లో పుష్కలంగా ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై కెసిఆర్ నేరుగానే నిలదీస్తున్నారన్నారు. అందుకే దేశ ప్రజలు కూడా కొత్త మార్పును కోరుకుంటారన్నారు. అయితే ఈ మార్పు ఎలా ఉండాలనే అంశంపై మరికొద్ది రోజుల్లో కొంత స్పష్టత వచ్చే అవకాశముందని దేవేగౌడ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీల శూన్యత నెలకొని ఉందన్నారు. ఆ భర్తీని కెసిఆర్ బిఆర్‌ఎస్ రూపంలో తీసుకవస్తుండం శుభసూచకమన్నారు.

కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్(కెఆర్‌టిఎ) ప్రతినిధులు సందీప్ కుమార్ మక్తాలా శనివారం బెంగళూరులో దేవేగౌడను కలిశారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన సిఎం కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని దేవేగౌడ పేర్కొన్నారు. కర్ణాటకలో ఆ పార్టీకి తమ నుంచి పూర్తిస్థాయి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంతో తనకున్న అనుబంధాన్ని దేవేగౌడ గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో భాగంగా వరంగల్లో నిర్వహించిన టిఆర్‌ఎస్ బహిరంగ సభకు తాను కూడా హాజరై మద్దతు ప్రకటించానని ఆయన పేర్కొన్నారు.

ఇది తన రాజకీయ జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టంగా భావిస్తున్నానని మాజీ ప్రధాని చెప్పారు. బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పును తీసుకొస్తుందన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో బిఆర్‌ఎస్ శక్తిమంతంగా మారుతుందని దేవేగౌడ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్‌కు మద్దతు పెరుగుతోందన్నారు. త్వరలో భారీగా చేరికలు కూడా ఉండే అవకాశముందని దేవేగౌడ్ పేర్కొన్నారు. కాగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య సంస్కృతి, సంప్రదాయాల బలోపేతానికి కృషి చేస్తున్న సందీప్ కుమార్‌పై దేవేగౌడ ప్రత్యేకంగా ప్రశంసలను కురిపించారు. ఇలాగే చిత్తశుద్ధితో పనిచేస్తూ ఇరు రాష్ట్రాల మైత్రి మరింత పటిష్టం చేయాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News