Saturday, December 21, 2024

9 ఏళ్ల పాలనలో 4 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం కోసం రైతన్నలకు 24 గంటల విద్యుత్‌ను అందించి మూడు పంటలు పండించాలన్న సంకల్పమే బీఆర్‌ఎస్ లక్షమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుద్దాల రైతు వేదికలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన రైతన్న – మేలుకో సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు మూడు పంటలు పండించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన చేసి నిరంతరం నీరుతో పాటు 24 గంటలు విద్యుత్‌ను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే అధికారంలోకి రాకముందే రైతన్నలపై ఉన్న కపట ప్రేమను కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటపెట్టారన్నారు.

రైతులకు మూడు గంటలు విద్యుత్ ఇస్తే సరిపోతుందని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో తరిమి కొట్టాలని పేర్కొన్నారు. రైతన్నలపై అనుషిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ అధినేత రేవంత్‌రెడ్డి నిజస్వరూపం బయట పడిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ ముత్యం సునీత – రమేష్, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ బోయిని రాజమల్లయ్య, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్‌చందర్‌రావు, ఎఎంసీ చైర్మన్ బుర్ర మౌనిక – శ్రీనివాస్, కెడీసీసీబీ డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, పీఎసీఎస్ చైర్మన్ జూపల్లి సందీప్‌రావు, సీనియర్ నాయకులు తిప్పారపు దయాకర్, కన్వీనర్లు మైలారం నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు పారుపెల్లి గుణపతి, ఎంపీటీసీ నిర్మల – ఓదెలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News