Saturday, November 16, 2024

తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్

- Advertisement -
- Advertisement -
  • ప్రతి పక్షాలతో ఒరిగేది ఏమి లేదు
  • రూ.10 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడవ సారి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సోమవారం పటాన్‌చెరు పట్టణంలో రు.10 కోట్లతో డిసిసిబి, ఆర్‌ఆడ్‌బీ అతిధి భవనం, ఫ్రీడమ్ పార్కు ప్రారంభోత్సవంతో పాటు జిహెచ్‌ఎంసి భవనం శంకుస్థాపన స్థానిక కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ప్రతి పక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఒరిగేది ఎమిలేదన్నారు. వారి వారి పార్టీల్లో అవుట్ డేటేడ్ నాయకులను పార్టీలోకి తీసుకుంటున్నారని వారితో బిఆర్‌ఎస్‌కి ఒరిగేది ఎమి లేదన్నారు.

కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడంలేదని ఆరోపించారు.దక్షణ భారత దేశంపై బిజెపికి చిన్న చూపుందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మల్లీ గెలిచేది మేమేనని గెలిచిన వెంటనే పటాన్‌చెరుకు మెట్రో రైల్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజి, పటాన్‌చెరుకు 200 పడకల ఆసుపత్రి మంజూరు చేసింది మన ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఓ నాడు కాలుష్యానికి అడ్డాగా ఉన్న పటన్‌చెరు నేడు ఐటి పరిశ్రమలకు నిలయైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News