Friday, December 20, 2024

తెలంగాణలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయం: చండీగఢ్ జ్యోతిష్కుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ జ్యోతిష్కుడు తెలంగాణలో గెలుపు ఎవరిదో తేల్చి చెప్పారు. గతంలో కర్ణాటక ఫలితాల్లో ఆయన జోస్యం ఫలించింది. తెలంగాణలో గెలిచేదెవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. ఈ ఏడాది తెలంగాణ మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ఫలితాలపైన తన అంచనాలను స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌దే గెలుపు తెలంగాణలో మరోసారి కెసిఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఈ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ తేల్చి చెప్పారు.

”నమో రుద్రాయ రానున్న తెలంగాణా ఎన్నికలలో కెసిఆర్ ప్రభుత్వమే మళ్లీ ఎన్నికై. తన పదవీకాలాన్ని కొనసాగిస్తుంది..” అంటూ రుద్ర కరణ్ పర్తాప్ ట్వీట్ చేశారు. చండీగఢ్‌కు చెందిన రుద్ర కరణ్ పర్తాప్ కర్ణాటక ఎన్నికల ఫలితాల వేళ ఫేమ్ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పారు. అందునా కాంగ్రెస్ కు 123 నుంచి 133 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశారు.. ఆయన అంచనాలు నిజమవుతూ కాంగ్రెస్‌కు 135 సీట్లు దక్కాయి. ఇప్పుడు ఇదే జ్యోతిష్కుడు తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన చెప్పుకొచ్చారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి మే నెల అనుకూలంగా లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కు గ్రహస్థితి అనుకూలంగా ఉందని యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఫలితాల తరువాత కూడా ఈ జ్యోతిష్కుడు చెప్పినది నిజమైందంటూ ట్వీట్లు కనిపించాయి.

గతంలో చెప్పిన సీట్ల సంఖ్య..ఫలితాలను కలిపి ట్వీట్లు చేశారు. ఇప్పుడు తెలంగాణ ఫలితాలపైన ఇదే జ్యోతిష్కుడు చెబుతున్న అంచనాలపైన ఆసక్తి పెరుగుతోంది. రాజకీయ చర్చ రుద్ర కరణ్ పర్తాప్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బిఆర్‌ఎస్ అభిమానులు దీనీని సర్క్యులేట్ చేస్తున్నారు. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలోనూ సిఎం కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్‌లలో ఆరోపణలు వస్తే మినహా మిగిలిన వారికి సీట్లు ఖాయమని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ జ్యోతిష్కుడు అంచనాల పైన బిజెపి, కాంగ్రెస్ శ్రేణులు విభేదిస్తున్నాయి. బిఆర్‌ఎస్ గెలుస్తుందంటూ వెల్లడించిన అంచనాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు దీనిపై బిఆర్‌ఎస్ శ్రేణులు స్పందిస్తూ ఇదే జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News