Monday, January 20, 2025

తెలంగాణలో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రానున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం తథ్యమని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ మాట్లాడు తూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభు త్వం అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

ఏ రంగంలో చూసి నా దేశంలో తెలంగాణ రాష్ట్రమే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేని కాంగ్రెస్, బిజెపి పార్టీల నేతలు తమ నోటికి ఇష్టం వ చ్చినట్లు మాట్లాడుతున్నారని, రానున్న ఎన్నికల్లో తా మే అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారన్నా రు. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయ ఢంకా మోగిస్తుందని, కాంగ్రెస్, బిజెపిలు మునిగే నా వలని ఎంఎల్‌ఎ ఎద్దేవా చేశారు.

ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి బిసిలపై ఎక్కడ లేని ప్రే మను ఒలకబోస్తూ మాట్లాడుతున్నారని, మాట్లాడే ముందు బిసిలకు ఏం చేశాం అని జీవన్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మీ హయాంలో ఎంతమం ది బిసిలను ముఖ్యమంత్రులు చేశారని ప్రశ్నిస్తూనే, బిసిలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి బి ఆర్‌ఎస్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఏ రంగంలో చూసినా గణనీయమైన అభివృద్ధి సాధించడంతో పాటు గతంలో కంటే చాలా గొప్పగా అన్ని వ ర్గాలను తీర్చిదిద్దుతున్నామన్నారు.

ఈ ఐదేళ్లలో గంగ పుత్రుల కోసం జగిత్యాల నియోజకవర్గంలో రూ.13. 98 కోట్లు వెచ్చించామన్నారు. అలాగే 4203 మంది గొల్ల, కురుమలకు 85 వేల గొర్రెలను అందించామన్నారు. మీ పాలనలో గొల్ల, కురుమల గురించి ఏనాడైనా ఆలోచించారా అని ఎంఎల్‌ఎ ప్రశ్నించారు. గౌ డన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం సొసైటీలను ఏ ర్పాటు చేసి అన్ని విధాలా అండగా నిలిచామని, తా టి చెట్టుపై నుంచి పడితే ఎక్స్‌గ్రేషియా అందించి ఆ దుకుంటున్నామన్నారు.

మీ హయాంలో చేనేతలకు వృత్తి లేకుండా చేశారని, తెలంగాణ ప్రభుత్వం వారి కి అండగా నిలిచిందన్నారు. నియోజకవర్గంలో 491 91మంది రైతులుండగా, ఇందులో 700 మంది ఎస్ సి రైతులకు పంటకు రూ.3.47 కోట్ల రైతు బంధును 11 విడతలుగా అందించామన్నారు. అలాగే 2591 మంది ఎస్‌టి రైతులకు రూ.2.32 కోట్ల చొప్పున అం దిస్తున్నామన్నారు. 35 వేల బిసి కుటుంబాల రైతులకు రూ.38.24 కోట్లు ప్రతి పంటకు అందిస్తున్నామన్నారు.

కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నామని, రజకులు, నాయీ బ్రాహ్మణ వృత్తి నిర్వహించుకునే వా రికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బిసి, ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులు విదేశా ల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ పథకం లేదని, తెలంగాణలో ఇప్పటి వరకు 1871 మంది బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఓవర్సీస్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు.

ఎబివిపి పాఠశాలలను మూసివేయించడం సరికాదని వారి చర్యను ఖండిస్తున్నానన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే విద్యా వ్యవస్థ మెరుగ్గా ఉందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో సెకండరీ విద్యలో 30 మందికి ఒక టీచర్ ఉంటే తెలంగాణలో 9 మందికి ఒకరు ఉన్నారన్నారు. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో 26 మందికి ఒక టీచర్ ఉంటే తెలంగాణలో 13 మందికి ఒకరు ఉన్నారని, ప్రాథమిక పాఠశాలల్లో బిజెపి పాలిత గుజరాత్ రాష్ట్రంలో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే తెలంగాణలో 20 మందికి ఒక టీచర్ ఉన్నారని గుర్తు చేశారు.

దే శంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలలు, గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కా ర్పోరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దేందుకు తెలంగా ణ ప్రభుత్వం కృషి చేస్తుంటే విద్యార్థులను అధోగతి పాలు చేసేందుకు పాఠశాలలను మూసివేయిస్తారా అంటూ ఎబివిపి నేతలపై ఎంఎల్‌ఎ మండిపడ్డారు.

ప్రతియేటా 5.90 లక్షల మంది పిల్లలకు ఉచిత భోజ నం, బట్టలు, పుస్తకాలు అందిస్తున్న ఘనత తెలంగా ణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఏ విషయంలో చూ సినా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మర థం పడుతూ ముచ్చటగా మూడవ సారి అధికారం కట్టబెట్టేందుకు సిధ్దంగా ఉన్నారన్నారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, కౌన్సిలర్లు క్యాదాసు నవీన్, పం బాల రాము, చాంద్ పాష, గంగసాగర్, నాయకులు బాల ముకుందం, బాలె శంకర్, అడువాల లక్ష్మణ్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News