Monday, December 23, 2024

మల్కాజిగిరి, ఆనంద్‌బాగ్‌ల నుంచి బిఆర్‌ఎస్ భారీ బైక్ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలు ముగింపు సందర్భంగా గురువారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశాల మేరకు మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎన్.జగధీష్‌గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి డివిజన్ నుండి బిఆర్‌ఎస్ నాయకులు , కార్యకర్తలు భారీగా వాహనాలతో తరలి వెళ్లారు. మల్కాజిగిరి చౌరస్తా మీదుగా అల్వాల్ ముత్యాలమ్మ అమ్మవారి గుడి నుండి నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమర వీరుల స్మారక చిహ్నం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్‌రావు, ప్రధాన కార్యదర్శి వినయ్‌గౌడ్, నాయకులు గంగాధర్ కృష్ణ, రఘుయాదవ్, నీలం సతీష్, శ్రీనివాస్, గణేష్, కోటేష్, సుధాకర్, రవీంధర్, రాజేష్‌యాదవ్, లడ్డూ, బంటి, రాజ్‌శేఖర్, గోపాల్ సింగ్, వెంకటేష్, భాస్కర్, రాజేష్, మహేష్, మల్లేష్‌గౌడ్, ప్రభాకర్, నవీన్‌గౌడ్, శివకుమార్, వినయ్, హరినాథ్, యాదగిరి, సన్నీ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం పురస్కరించుకొని ఆనంద్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్ వై. ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో బిఆర్‌ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు నోరి.సత్యమూర్తి, నాయకులు బాబు, సత్యనారాయణ, సంపత్‌రావు, ఉపేందర్, ఉమాపతి, బ్రహ్మయ్య, నాగేష్, శంకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, సునిత రాముయాదవ్, మీనా ఉపేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్. జగధీష్‌గౌడ్, నాయకులు సతీష్‌కుమార్, రాముయాదవ్, గుండా నిరంజన్, సంతోష్ రాందాసు, మోహన్‌రెడ్డి, డివిజన్‌ల అధ్యక్షులు నోరి. సత్యమూర్తి, తులసీ సురేష్, నర్సింగ్‌రావు, ఆలయ పూజారి సత్య పండిట్, రాంబాబు, ఆనంద్ బాగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News