Saturday, January 4, 2025

జోష్‌లో బిఆర్‌ఎస్ … స్ట్రెస్‌లో కాంగ్రెస్…

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : మరికొద్ది మాసాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో విజయమే లక్షంగా దూసుకు వెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో ప్రగతి నివేదన సభ పేరుతో తుంగతుర్తిలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో ఆనందం వెల్లువిరుస్తోంది.

రానున్న ఎన్నికల్లో తామే ప్రధాన పోటీదారి అని చెబుతున్న కాంగ్రెస్, భాజాపాలు పలు నియోజకవర్గాలలో సతమతమవుతున్న పరిస్థితి ఒకవైపు ఉండగా మరికొన్ని చోట్ల కనిపిస్తున్నారు. ప్రధా నంగా జిల్లా కేంద్రమైన సూర్యాపేటతో పాటు, తుంగతుర్తి నియోజకవర్గంలో ఆ పార్టీల అ భ్యర్ధులు ఎవరనే విజయంలో రాజకీయ వర్గాలలో చర్చని అంశంగా మారింది. సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత సమక్షంలోనే తోపులాట, పిడుగుద్దుల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. రెండు వర్గాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ పైపైకి మాత్రమే ఐక్యతారాగం ఆల పిస్తున్నారా అన్న చర్చ లేకపోలేదు. సభ వేదికల పై ప్రజల ముందు కలిసి ముందుకు సాగిన ఎవరి మనుసలో ఏముందో అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ ఐక్యతారాగం జో రుగా సాగుతుంది.

జిల్లాలోని ఒకటైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యాయం డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్‌ను పిలుపునిచ్చిన పరిస్థితితో దా దాపు ఖరారైనట్లుగా చెప్పకనే చెప్పవచ్చు. సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరో మారు బరిలో ఉండడం విధితమే. మిగిలిన రెండు నియో జకవర్గాలలో సైతం అభ్యర్ధులను ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కా ంగ్రెస్‌లో సజావుగా సాగేందుకు ఎంతకాలం పడుతుందో అన్న సమరానికి సన్నద్ధం కా వడానికి ఎదురుచూపులు తప్పని పరిస్థితి. మరో ప్రత్యామ్నాయం భాజపా రానున్న ఎన్నికల్లో అవకాశాలు లేవన్నది రాజకీయ వర్గాల బోగట్టా. మొత్తానికి జోష్‌లో భారాసా..స్ట్రెస్‌లో కాంగ్రెస్ అన్న పరిస్థితి కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News