Wednesday, January 22, 2025

ప్రపంచానికే అన్నపూర్ణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రలో వచ్చే జెడ్‌పి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ జెండా ఎగరాలని, త్వరలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బుధవారం తెలంగా ణ భవన్‌లో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకు లు బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్ర సంగిస్తూ, మహారాష్ట్ర నుంచి వచ్చిన బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు ప్రణామాలు, స్వాగ తం పలికారు. ఇంతకుముందే పలు మీటింగ్‌లలో మీ రు తన సందేశాన్ని విని ఉన్నారన్నారు. దేశంలో ఎన్నో పార్టీలున్నాయని, మరెందరో రాజకీయ నాయకులున్నారన్నారు. దేశంలో వీటికి తక్కువ లేదని, దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ఇలా ఎ న్నో పార్టీలున్నాయని పేర్కొన్నారు. 75వ స్వతంత్ర భా రతదేశంలో వేల ప్రసంగాలను మనం విన్నామని గుర్తు చేశారు. ఎందరో రాజకీయ నాయకుల మాటలు విన్నారని, మనది వింతైన దేశమని, మన దేశ ప్రజలు కూడా వింతైన వారన్నారు. దేశ పరిస్థితుల పై అవగాహన ఉండి కూడా మనం సరైన రీతిలో స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనం కుట్రలో ఇరుక్కుపోయామని.. దీనికి గల కారణాలను ఏమిటి ? దీని పై మనం తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

తాను ఇక్కడ చెప్పే విషయాలను ఇక్కడే మరిచిపోకుండా మీ మీ ఊళ్ళకు వెళ్ళిన తర్వాత ఈ విషయాల పై చర్చించమని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా కోరుతున్నానన్నారు. దీని వెనుక నేపథ్యాన్ని, మంచి చెడులను, నిజానిజాలను చర్చిస్తే మీరు దేశానికి ప్రయోజనం చేకూర్చినవారవుతారని తెలిపారు. ఎన్నికల కోసమో, ఎవరినో నాయకుడ్ని చేయలనే లక్ష్యంతోనే బిఆర్‌ఎస్ ఆవిర్భవించలేదన్నారు. కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైన పార్టీ కాదని, భారతదేశం సంస్కరించబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశం సంస్కరించబడనంత వరకు మన జీవితాలు మారవని తెలిపారు. ప్రసంగాలు వింటుంటూనే, రాజకీయ నాయకుల పొగడ్తలు వింటుంటేనే మన దేశ పరిస్థితిల్లో ఎలాంటి మార్పులు రాబోవన్నారు. ఇది ఖాయమని పేర్కొన్నారు. 50 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. తాను అంతా గమనిస్తూనే ఉన్నానని, అంతా మన కళ్ల ముందే ఉందన్నారు. మన దేశానికి అపూర్వ సంపద ఉందని గుర్తు చేశారు. ఎవ్వరిని బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. నీరు, విద్యుత్తు వంటి సమస్యలను కేవలం తెలంగాణ రాష్ట్రం తప్పించి మహారాష్ట్రతో సహా యావత్ దేశం ఎదుర్కొంటున్నదన్నారు.

తాగునీరు, సాగునీరు, పరిశ్రమలతో ఇతర అవసరాలకు కావాల్సిన నీటి వనరులకు మించి రెండు రెట్ల జల వనరులు మన దేశంలో అందుబాటులో ఉన్నప్పటికీ మనం నీటి కొరతను ఎదుర్కొంటున్నామన్నారు. ఈ ఒక్క విషయాన్ని విశ్లేషిస్తే మనకు మిగతా పరిస్థితులను అవగాహనలోకి వస్తాయని వెల్లడించారు. మహారాష్ట్ర ‘కిచిడీ’ ప్రభుత్వం నుంచి మమ్మల్ని రక్షించమని ప్రజలు కోరుతున్నారని, జల వనరుల కోసం మన దేశం రష్యానో, అమెరికానో ప్రాధేయపడాల్సిన అవసరం లేదని, ఎవరి అనుమతి అవసరం లేదని పునరుద్ఘాటించారు. పుష్కలంగా నీటి లభ్యత ఉన్నప్పటికీ మనకు నీరు ఎందుకు అందటం లేదని, దీని వెనుక జరుగుతున్నదేమిటి ? రాజకీయాలు, విధానాలు, రాజ్యాంగం అనే అంశాలు ఎక్కడో ఆకాశంలో లేవని, మన భూమి పైనే ఉన్నాయన్నారు. నీరు లేకపోతే జీవితమే లేదని వెల్లడించారు. మరి నీటి సమస్యలు ఎందుకు నివారించలేకపోతున్నారు ? నీటిని ఫ్యాక్టరీల్లో తయారుచేయలేం, మనిషి నీటిని తయారుచేయనే లేడు. నీరు దేవుడు ప్రసాదించిన వరమని పేర్కొన్నారు. నీటిని పరిశ్రమల్లో తయారుచేయడం మీరు ఎవరైనా చూశారా ? ఇది చిన్న విషయమే కావచ్చు.

కానీ ఎవరికీ దీని పై ఆలోచనే లేదని తెలిపారు. నీటిని భగవంతుడు సృష్టిస్తే ప్రకృతి మనకు అందిస్తుందని, నీరు చాలా అమూల్యమైనదని, నీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. మన దేశంలోని ఎన్నో వరద ప్రభావిత ప్రాంతాలున్నాయన్నారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఐనా మనం ఏమీ జరగనట్లుగా ఉంటామన్నారు. రాజకీయ నాయకులకు గానీ మనకు గానీ ఎలాంటి విచారం లేదని, ప్రజలు ఒక పార్టీకి కాకపోతే మరొక పార్టీకి ఓటు వేస్తారు, కాబట్టీ వాళ్ళకు ఎలాంటి బాధా లేదని, వాళ్ళ దుకాణాలు ఏదో ఒక విధంగా నడుస్తూనే ఉన్నాయని, రైతుల చనిపోతే వాళ్ళకు పోయేదేముంది, మనం మూర్ఖులం, ఐనా వారికి ఓటు వేస్తూనే సాగుతున్నామన్నారు. ఎన్నికలు రాగానే మనకు కులతత్వ రోగం, మతతత్వ రోగం అంటుకొని మనం విభజింపబడతామని పేర్కొన్నారు. మన జీవితాలను మార్చే ఓటును వారు చెప్పారని, వీరు చెప్పారని ఎలాంటి ఆలోచన లేకుండా చాలా తేలిగ్గా ఎవరికి పడితే వారికి వేస్తున్నామని, ఎవరికి ఓటు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే ఆలోచన లేకుండా ఓటు వేయవద్దని, బాగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

గడ్చిరోలి ప్రాంతం గుండా గోదావరి నది ప్రవహిస్తున్నా, అక్కడ తాగడానికి నీరు ఎందుకు లభించడం లేదు ? అని ప్రశ్నించారు. ఎంఎల్‌ఎలు, ఎంపిలు, అసెంబ్లీలు, మంత్రిత్వశాఖలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఉన్నా దేశానికి ఈ బలహీనత ఏంటి? అని అన్నారు. దేశంలో 1 లక్షల 40 వేల టిఎంసిల వర్షపాతం కలుగుతోందని, దీంట్లో సగం నీరు భాష్పీకరణ చెందుతుందన్నారు. ఇంకా 70వేల టిఎంసిల నీరు మన నదుల్లో ప్రవహిస్తుందన్నారు. అమెరికా వైశాల్యం మన కన్నా రెండున్నర రెట్లు, చైనా వైశాల్యం మన దేశం కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కానీ వారి దగ్గర వ్యవసాయ యోగ్యమైన భూమి తక్కువగా ఉందని తెలిపారు. అమెరికాలో వ్యవసాయ యోగ్యమైన భూమి 19 శాతం, చైనాలో 16 శాతం మాత్రమే ఉందన్నారు. మన భారతదేశం భాగ్యవంతమైన దేశమని, దేశ పూర్తి వైశాల్యం 83 కోట్ల ఎకరాలుంటే అందులో 41 కోట్ల ఎకరాల భూమి (50 శాతం) వ్యవసాయ యోగ్యమైనదని వెల్లడించారు. ఇటువంటి పరిస్థితుల్లో మనదేశం యావత్ ప్రపంచానికి అన్నం పెట్టాల్సిందని, మన దేశ రైతు ప్రపంచంలోనే అవ్వల్ దర్జా రైతుగా ఉండాలని ఆకాంక్షించారు.

రైతులు పొలాల్లో పండించిన పంటలు నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు వెళ్లాల్సి ఉందన్నారు. వీటిలో కోట్ల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభించాలని. ఇక్కడ తయారైన ఆహారోత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావాలన్నారు. కానీ ఈ రోజు దేశంలో ఏం జరుగుతున్నది ? మన పిల్లలు పట్టణాల్లో, గ్రామాల్లో కూడా మెక్ డొనాల్ పిజ్జా తింటున్నారని, మన జొన్నరొట్టె ముందు అదెంత ? కానీ మనం పిజ్జాలు తింటున్నాం. బర్గర్లు తింటుండటం శోచనీయమన్నారు. అసలు కథేంటి ? 70 వేల టిఎంసిల నీటి లభ్యత ఉన్నమన దేశంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైనదైతే భారతదేశంలోని ప్రతీ ఎకరాకు నీటి అందించవచ్చన్నారు. మరెందుకు ఇవ్వలేక పోతున్నారని, నీరు ఎటు పోతంది.? మన కళ్ల ముందే నీరు గడ్చిరోలి జిల్లా నుండి సిరోంచ తాలూక గుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తున్నదని, మన నాయకులందరి ముందు నీరు ప్రవహించుకుంటూ పోతున్నదని, ప్రజలతో ఇలాంటి ప్రహసనాలు ఇంకెన్నాళ్ళు చేస్తారని ప్రశ్నించారు.

ప్రజలకు సాగునీరు, తాగునీరు అందిస్తారా? ఇవ్వరా? అనేది సవాల్ లాంటిదన్నారు. ఈ నాటకాన్ని సమాప్తం చేసి నీటిని బంధించి, ఆనకట్టలు కట్టి ప్రజలకు తాగునీటిని, పంట పొలాలకు సాగునీటిని అందించి రైతన్నలు బంగారు పంటలు పండించి, వారి ఇండ్లు సిరిసంపదలతో తులతూగేలా చేసే లక్ష్యంతో బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. ఇది వాస్తవ రూపం దాల్చాలా? వద్దా? మీరు ఆలోచించుకోండన్నారు. తెలం గాణలో ప్రతీ ఇంటిలో తాగునీటి నల్లాలున్నాయన్నారు. ప్రతీ ఇంటికి కావాల్సిన శుద్ధమైన తాగునీటిని అందించడం జరుగుతోందని తెలిపారు. తాగునీటిని అందించే ముందు నాణ్యతా పరీక్షలు చేసి అందిస్తున్నామన్నారు. బంజారాహిల్స్‌లో ధనికులు తాగే నీటినే ఆదిలాబాద్ జిల్లాలో నివసించే గోండులు కూడా తాగుతున్నారన్నారు. మరి మహారాష్ట్రలో తాగునీటిని ఎందుకు అందించలేకపోతున్నారన్నారు. మహారాష్ట్ర పుణ్యభూమిలో ఎన్నో నదులు పుడుతున్నాయని, గోదావరి, కృష్ణా, వెన్ గంగ, పెన్ గంగ, వార్ధా, మూల, ప్రవర, పంచగంగ, మంజీర, భీమా లాంటి ఎన్నో నదులు ఇక్కడ పుడుతున్నాయన్నారు. మహరాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఎనిమిది రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారని తెలిసిందన్నారు.

అకోలా లోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు, ఎందుకూ అగత్యం ? మహారాష్ట్రలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుక పూర్వం ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేవన్నారు. తాగేందుక నీళ్ళు లేకుండేవని, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. వ్యవసాయానికి నడిరాత్రిలో ఇచ్చే కరెంటుతో పాములు కుట్టి, షాక్‌లు తగిలి రైతులు మరణించేవారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని, ప్రజలు వలస పోయేవారన్నారు. పోరాటం చేసి దేవుని దయతో సొంత రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. నేడు రైతుల ఆత్మహత్యలు లేవు, వలస పోయిన వారు తిరిగి తమ సొంతూళ్లకు తిరిగి వచ్చారన్నారు. రైతులకు 24 గంటల కరెంటునిస్తున్నామని, మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలడం అనే సమస్యలు లేవని వెల్లడించారు. తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడిగా రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి 10 వేల రూపాయలిస్తున్నామన్నారు. పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలైతే అన్ని ఎకరాలకు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం 2,601 అగ్రి క్లస్టర్లుగా విభజించి, ఒక్కో క్లస్టర్ కు అగ్రికల్చర్ ఆఫీసర్ ను నియమించామన్నారు. 5000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ చొప్పున బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరి వద్ద ప్రతీ రైతుకు సంబంధించిన అడ్రస్, ఆధారకార్డు, ఫోన్ నంబర్ తదితర సమాచారం ఉంటుందన్నారు. పంట పెట్టుబడితో పాటు రైతు ఏదైనా కారణాలతో మరణిస్తే రూ. 5 లక్షలు బీమాగా అందిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, రైతు మరణిస్తే 8 రోజుల్లోగా వారి కుటుంబానికి బీమా మొత్తాన్ని అందించడం జరుగుతోందన్నారు. ఇప్పటివరకు మరణించిన 1 లక్ష మంది రైతులకు ఈ బీమా మొత్తాన్ని చెల్లించి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకున్నదని తెలిపారు. వ్యవసాయ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఈ బీమా మొత్తాన్ని అందిస్తున్నామన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను తెలంగాణ ప్రభుత్వమే నేరుగా కొంటుందని, రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్య సేకరణ జరుగుతున్నదని వెల్లడించారు. 7,100కు పైగా ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని, మూడు నాలుగైదు రోజుల్లోగా వారి ఖాతాల్లో ప్రభుత్వం పైసలు జమ చేస్తోందన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాల ప్రయోజనాలను ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుందని, రైతును రాజు చేసే విధానమంటే ఇదన్నారు.

ఇక భూ రికార్డుల్లో జరిగే అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, భూమ యాజమాన్య హక్కులు ఎవరి నుంచి ఎవరికి సంక్రమిస్తాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఉండేదన్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ రైతుల రక్తాన్ని పీల్చివేసిందన్నారు. మహారాష్ట్రలో భూ క్రయవిక్రయాల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి, పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా ముగిసేటట్లుగా విధానాలు తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని పుకార్లు పుట్టిస్తున్నారని, తాము ఇక్కడ ఏండ్లుగా అమలు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉందన్నారు. మహారాష్ట్రకంటే చిన్న రాష్ట్రం కావడంతో పాటు ఆర్థికంగా మహారాష్ట్ర తర్వాతే నిలిచే రాష్ట్రమైన తెలంగాణ దివాళా తీయనప్పుడు మహారాష్ట్ర ఎలా దివాళా తీస్తుంది? అని ప్రశ్నించారు. కానీ అవినీతికి పాల్పడే నాయకులు మాత్రం దివాళా తీస్తారన్నారు. నీళ్లు, కరెంటు విషయంలో దేశ ప్రజలను ఎందుకు వంచిస్తున్నారు?అని ప్రశ్నించారు. ప్రకృతి ఇచ్చిన వరాన్ని ఎందుకు కాలరాస్తున్నారు? అని అన్నారు.

ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మన సమస్యలు తీర్చరని, మనమెంత చైతన్యంగా ఉంటే అంత త్వరగా సమస్యలు తీరుతాయన్నారు. మేకిన్ ఇండియా అంటారని, దేశమంతా నిండా చైనా బజార్లే ఉంటాయని ఎద్దేవా చేశారు. పతంగుల మాంజా నుంచి దేవుళ్ల విగ్రహాల దాకా చైనా నుంచే వస్తాయని, ఫ్లయిట్ నుంచి లైట్ వరకు చైనా నుంచే ఎందుకు తెచ్చుకోవాలి? అని ప్రశ్నించారు. మన వస్తువులను మనం తయారు చేసుకునే శక్తి, యుక్తులు, సంపద మనకు లేవా? అని అన్నారు. భారత్ రాష్ట్ర సమితి ‘భారత్ పరివర్తన్ మిషన్‌గా’ పని చేస్తుందన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఏం పని అని ఫడ్నవీస్ ప్రశ్నించారన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేస్తే మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోతామని చెప్పారని తెలిపారు. ఫడ్నవీస్ నుండి ఇప్పటి వరకు ఏం సమాధానం రాలేదన్నారు. మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో కెసిఆర్ కావాలి. రైతు ఆత్మహత్యలు లేని మహారాష్ట్రగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.

తెలంగాణలో సాధ్యమైన పథకాలు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు? మహారాష్ట్రలో వచ్చే జెడ్‌పి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ జెండా ఎగరాలన్నారు. ఓటు వేస్తేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. మహారాష్ట్రలో ప్రతీ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ నేతలుంటారన్నారు. అన్ని కమిటీలు వేసి మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేద్దామన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలతో బిఆర్‌ఎస్ రంగంలోకి దూకుతుందని, ప్రతీ గడపను తట్టండి. ప్రతీ మనిషినీ పలకరించండన్నారు. నాగ్‌పూర్, ఔరంగాబాద్‌లో బిఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మే 7 నుంచి జూన్ 7 వరకు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బిఆర్‌ఎస్ కమిటీలు వేస్తామన్నారు. 10 నుంచి 12లక్షల మందితో మహారాష్ట్రలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామని, బిఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News