Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ బిజెపి బంధువుల పార్టీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం :అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పె న్షన్ ఇస్తామని ఏఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ ప్ర కటించారు. గిరిజనులకు పోడు భూములను పం పిణీ చేస్తామని ఆయన తెలిపారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీలో చేరిక, భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ‘జన గర్జన’ సభలో రాహుల్ మా ట్లాడుతూ భారత్ జోడో యాత్రకు తెలంగాణ ప్ర జలు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. దే శాన్ని కలపడం మన విధానమని, విడదీయడం బిజెపి విధానమన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు ప్రజలు అండగా నిలిచారని, ప్రజల మనస్సుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని రాహుల్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ బిజెపికి బిటీమ్ అని, ఆ పార్టీ బిజెపి బంధువుల పార్టీ అని రాహుల్‌గాంధీ బిఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో బిజెపి నిర్ణయాలకు మొదటి నుంచి మద్దతు తెలుపుతున్న బిఆర్‌ఎస్ నిజస్వరూపాన్ని ప్రజలు ఇకనైనా గ్రహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ కారణాల చేత పా ర్టీ వీడిన నేతలంతా తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన సూచించారు. కర్ణాటకలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించామని, కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలిచారని రాహుల్ తెలిపారు. కర్ణాటకలో జరిగిందే తెలంగాణలోకూడా జరుగుతుందన్నారు.తెలంగాణలోబి జెపి అడ్రస్ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. పొంగులేటితో పాటు ఆయన అనుచరులకు రాహుల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి: రేవంత్‌రెడ్డి జోస్యం
డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లో ఉంటుందని ఆరోజే విజయోత్సవ సభ ఇక్కడే జరుపుతామని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీ మా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి పునా ది వేసింది ఖమ్మం జిల్లానేనని ఆయన గుర్తు చేశా రు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ సభకు భారీగా ప్రజానీకం వచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే సంక్షేమం, అ భివృద్ధి రెండు పాదాలపై నడిపిస్తామని రేవంత్ అ న్నారు. పొంగులేటి చేరికతో ఖమ్మంలో పదికి పది సీట్లు కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన కాం గ్రెస్ జనగర్జన సభలో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క తదితరులు ప్రసంగించారు.
రాహుల్‌గాంధీకి ముద్దు పెట్టిన గద్దర్
ఖమ్మం వేదికగా జరిగిన కాంగ్రెస్ జన గర్జన సభ కు జనం పోటెత్తారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీకి ఎపి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికా రు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఖమ్మం చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద రాహుల్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. రాహుల్ కారును అభిమానులు, కార్యకర్తలు చుట్టుముట్టారు.
దీంతో అక్కడి పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం అక్కడి నుంచి ఓపెన్ టాప్ కారులో అభివాదం చేస్తూ వేదిక వద్దకు రాహుల్ గాంధీ చేరుకున్నారు. వేదిక వద్దకు చేరుకున్న రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకుని గద్దర్ ముద్దు పెట్టుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్కను రాహుల్‌గాంధీ భుజం తటారు. పాదయాత్రగా సభా వేదిక వద్దకు చేరుకున్న భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News