Monday, December 23, 2024

ప్రచారంలో అందరి కంటే ముందున్న బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో నగరంలో పూర్తిగా రాజకీయ వేడి రగులుకుంది. ఇప్పటీ వరకు అధికార బిఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడంతో పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ గత రెండు నెలల కిత్రమే అభ్యర్థులు ప్రకటించడమే కాకుండా ఇటీవలే బిఆర్‌ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన చేతుల మీదగా బి ఫామ్స్‌ను సైతం అందజేయడంతో ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో అందరి కంటే ముందుకుగా దూసుకుపోతున్నారు.

కూకట్‌పల్లిలో మాదావరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్‌లో వివేకానంద, మల్కాజ్‌గిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్‌లో బండారి లకా్ష్మరెడ్డి, ఎల్‌బినగర్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శేరిలింగంపల్లిల్లో అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాధ్, ఖైరతాబాద్‌లో దానం నాగేందర్, సనత్ నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్‌లో ముఠా గోపాల్, అంబర్‌పేట్‌లో కాలేరు వెంకటేశం, కంటోన్మెంట్‌లో లాస్యనందిత, సికింద్రాబాద్‌లో టి.పద్మారాలు పాదయాత్రతో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

వీరంతా ఇప్పటికే మొదటి విడుత ప్రచారం పూర్తి చేసిన వీరంతా బి ఫామ్స్ అందకున్న తర్వాత నామినేషన్ల పర్వం నాటికి రెండవ దఫా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. తద్వారాలో గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బిఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లును సాధించేందుకు సమాయత్తం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News