Saturday, November 23, 2024

76 సీట్లతో బిఆర్‌ఎస్‌దే మళ్లీ అధికారం

- Advertisement -
- Advertisement -

జీ న్యూస్, మాట్రిజ్ సర్వే అంచనా

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ పక్కా అని జీ న్యూస్,మాట్రిజ్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, బిఆర్‌ఎస్ పార్టీ 70 నుంచి 76 సీట్లు గెలిచి మరోసారి అధికారం చేపడుతుందని జీ న్యూస్ మాట్రిజ్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ 27 నుంచి 33 సీట్లకే పరిమితం కానుండగా, బిజెపి 5 నుంచి 8 స్థానాలతో మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుందని జీ న్యూస్, మాట్రిజ్ సర్వే అంచనా వేసింది.

ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 6 నుంచి 7 స్థానాలు గెలుస్తుందని, ఇతరులు గరిష్టంగా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రి మళ్లీ ఉండాలని 36శాతం మంది ప్రజలు కోరుకుంటున్న సర్వే వెల్లడించింది. ము చ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ప్రజల అవసరాలను తీర్చేందుకు బిఆర్‌ఎస్ నడుం బిగించింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న వేళ.. మిగిలిన రాజకీయ పార్టీల కన్నా మిన్నగా ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ అధినేత, అన్ని పార్టీల కంటే ముందుగానే మ్యానిఫెస్టోను ప్రకటించిన ప్రజల్లోకి వెళ్లారు.

బిఆర్‌ఎస్ మెనిఫెస్టోలో సబ్బండవర్గాలకు మేలు చేసే హామీలు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా అభాగ్యులకు పింఛన్ల పెంపు సాహసోపేతమైన నిర్ణయంగా మేధావులు కీర్తిస్తున్నారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకు రాబోతుండడం బిఆర్‌ఎస్ మానవీయతకు అద్దం పడుతున్నది. మహిళలకు భృతి, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు ఒకటేమిటి అనేకానేక పథకాల సమాహారంతో సిఎం కెసిఆర్ ప్రకటించిన ఎన్నికల హామీలు ఎంతో ఆకర్షిస్తున్నాయి.మూడోసారి అధికారంలోకి రాగానే ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను కొనసాగించడంతోపాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని సిఎం కెసిఆర్ చెప్పడంతో అన్ని వర్గాల ప్రజలలో విశ్వాసం ఏర్పడి బిఆర్‌ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు జీ న్యూస్,మాట్రిజ్ సర్వే తేల్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News