Monday, January 20, 2025

వికలాంగులకు బిఆర్‌ఎస్ పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల: వికలాంగులకు బిఆర్‌ఎస్ పెద్దపీట వేస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వికలాంగులకు సిఎం కెసిఆర్ రూ. 1000 పెంచుతామని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం స్థానిక అంగడి బజార్ చౌరస్తా వద్ద , చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట నాలుగు మండలాలకు సంబంధించిన వికలాంగులతో కలిస సిఎం కెసిఆర్ చిత్రపటానికి పూలమాల వేసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగులలో మనోధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ రూ. 1000 పెంపు హర్షదాయకమన్నారు. సమాజంలో వికలాంగులు కూడా మనలో ఒకరని ఎవర్ని చిన్న చూపు చూడొద్దన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలా ప్రజాప్రతినిధులు, వికలాంగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News