Wednesday, January 22, 2025

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం

- Advertisement -
- Advertisement -

రామకృష్ణాపూర్ : రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజయ బావుటా ఎగరవేస్తారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బుధవారం చెన్నూరు నియోజకవర్గం, క్యాతన్‌పల్లిలోని ఆయన నివాసంలో ని యోజకవరోగంలోని 357 మంది ఆడబిడ్డలకు 3.57 కోట్ల విలువ గల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేశా రు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మహిళలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఇప్పటి వరకు 11 వేల మం దికి కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు.

12259 మందికి ఒంటరి మహిళ పించన్లు, 786 మంది మహిళలకు వితంతు పించన్లు అందజేస్తున్నామన్నారు. 3055 మందికి సింగరేణి ఇండ్ల పట్టాలు, 100 గ్రామాల్లో 11 వేల మందికి కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్ కిట్ అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ మమిళలకు 100 గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ భవనాలు, ఒక్కో భవనానికి 18 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్నామన్నారు.

చెన్నూరు మహిళా భవన్‌కు రూ. 1.50 కోట్ల, రామకృష్ణాపూర్ మహిళా భవన్‌కు 2 కోట్లు మందమర్రికి రూ. 2 కోట్ల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. వైద్యం కోసం, చిన్నారుల విద్య కోసం 10 కోట్లతో చెన్నూరు పట్టణంలో మాతా శిశు సంక్షేమ దావఖానా నిర్మించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమాభివృద్దికి పెద్దపీట వేస్తున్నారన్నారు. తదితర అభివృద్ది, సంక్షేమ పథకాలతో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. అందరు ఏకతాటిపై ఉండి బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News