Monday, December 23, 2024

వ్యవసాయానికి పునర్జీవనం పోసిన ఘనత బిఆర్‌ఎస్‌దే

- Advertisement -
- Advertisement -

పెగడపల్లి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల హంగులు కల్పించి వ్యవసాయానికి పునర్జీవం పోసిన ఘనత టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం మండలంలోని నందగిరి రైతు వేదికల వేదిక క్లస్టర్ గ్రామాల రైతులతో ప్రత్యేక రైతు సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొప్పుల ఈశ్వర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం గత 70 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు రైతన్న ఆర్థిక అభివృద్ధి నీ కేవలం 9 సంవత్సరాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి పెట్టిoది బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయమే దండగ అన్న ప్రభుత్వాలు నేడు టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం రైతన్నల కోసం చేస్తున్న అభివృద్ధిని పండగల చేసుకుంటున్న వ్యవసాయాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.

రైతుకు మూడు పంటలు పండే విధంగా 24 గంటలు కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రైతుకు మూడు గంటలే చాలు అని అనడం చాలా బాధాకరమని అన్నారు. ఎకరానికి గంట సమయం కరెంటు ఇస్తే ఒక మడి కూడా నీరు పట్టదని ప్రతిపక్షాలు గుర్తుతెరగాలని తెలిపారు. రాష్ట్రంలో మూడు పంటలు వేసుకునేలా చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించి కాలువలు ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షాలు రైతులను కించపరిచేలా మాట్లాడుతున్నాయని వారి మాటలు ఎవరు నమ్మద్దని తెలిపారు.

24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చే ప్రభుత్వం కావాలా మూడు గంటలు ఇచ్చే ప్రభుత్వం కావాలా ప్రతి ఒక్కరు తేల్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కేవలం రైతన్నల అభివృద్ధి కోసం నాలుగున్నర లక్షల కోట్లు రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. ఏ రాష్ట్రంలో రైతు కోసం ప్రవేశపెట్టని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తూ వారికి కొండంత అండను మన ముఖ్యమంత్రి ఇస్తున్నారని తెలిపారు. రైతన్న కోసం రైతుబంధు, రైతు బీమా, రైతు కోరిన విత్తనాలను ఎరువులను అందుబాటులో ఉంచిన గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.

బొమ్మరిల్లు లాగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాన్ని ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాన్ని ముక్కలు చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు కరెంటు అడుగుతే కాల్చివేసిన ఘనత గత ప్రభుత్వాలకి దక్కుతుందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణలో విద్యుత్ వైర్లపై బట్టలు ఆరేసుకోవచ్చని అన్న వారి నోర్లు మూతపడేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రైతులు ఏనాడు 24 గంటలు కరెంటు ఇవ్వమని అడగకు నన్ను రైతు కష్టాలు తెలిసిన మన ముఖ్యమంత్రి ఉచితంగా 24 గంటలు కరెంటు ఇచ్చి వారు 3 పంటలు సాగు చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజలు ప్రభుత్వ మద్దతు ప్రభుత్వమే కొని వారి ఖాతాల్లో పంట డబ్బులను జమ చేస్తూ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వమేనని వివరించారు. ఇప్పటికైనా టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ ఘనతను ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని మరో మారు టిఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉండి గెలిపించుకొని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పిటిసి కాసుగంటి రాజేందర్ రావు, ఎంపీపీ గోలి శోభ సురేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, స్థానిక సర్పంచి గాజుల రాకేష్ తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ లతోపాటు రైతుబంధు సమితి మండల శాఖ అధ్యక్షుడు ఉప్పుగళ్ళ నరేందర్ రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు లోక మల్లారెడ్డి, మహిళా అధ్యక్షురాలు సుంకరి మమత రవి, ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న, అడ్వైజర్ కమిటీ మండల అధికార ప్రతినిధి,

టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇరుగురాల ఆనందం, ఏఎంసి వైస్ చైర్మన్ రాజు ఆంజనేయులు,విండో చైర్మన్లు మంత్రి వేణుగోపాల్, భాస్కర్ రెడ్డి, విండో ఉపాధ్యక్షుడు నామ సురేందర్రావు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ షకీల్, యువజన శాఖ మండల అధ్యక్షుడు సొల్లేటి సంతోష్ కుమార్, నలువాల లక్ష్మణ్ పార్టీ వివిధ హోదా శాఖల నాయకులు ఆరెల్లి లక్ష్మీరాజ్యం, ఎండి జానీపాష, విజయ్ యాదవ్, సంజీవరెడ్డి,j శ్రీనివాస్, తోట మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News