Thursday, January 23, 2025

పరివర్తన కోసమే బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్/భైంసా: దేశాన్ని నడపడంలో ఒక గొప్ప మార్పు అనివార్యమైందని బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ మార్పులు తీసుకురావడానికే తాను జాతీయ రాజకీయాల్లోకి వ చ్చినట్లు వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం లభిం చి75 సంవత్సరాలు అవుతున్నా… తాగడానికి నీళ్ళుండవు…. సాగు నీరు ఉండదు… విద్యుత్తు లభించదన్నా రు. ఎన్నో ప్రభుత్వాలు, నాయకులు మారుతున్నా దే శానికి ఎలాంటి మేలు జరగలేదన్నారు. ఆశించిన స్థా యిలో దేశం పురోగతి సాధించలేకపోయిందన్నారు. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భారత్ పేద దేశం కా దని… భారత్ మేధావుల దేశమన్నారు. అమెరికా కం టే సుసంపన్న దేశంగా ఎదగడం భారత్‌కు అసా ధ్యం కాదన్నారు. మన దేశంలో ఉన్నంత సాగు యోగ్యమైన భూమి ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. అయినప్పటికీ ఆ దిశగా దేశం ముందుకు పోవడం లేదన్నా రు.

ఇందుకు ప్రధాన కారణం పాలకులకు ముందుచూపు లోపించడమేనని కెసిఆర్ మండిపడ్డారు. దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకవెళ్లాలన్న చిత్తశుద్ధి లేకపోవడమేనని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మహారాష్ట్ర నాందేడ్‌లోని గురుగోవింద్ సింగ్ గ్రౌండ్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వా రిని ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడుతూ, మరోసారి తనదైన శైలి లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అనేక మంది ప్రధానులు మారారు…. పార్టీలు మారాయన్నారు. కానీ దేశ పరిస్థితులు మారలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మ హారాష్ట్రలోనే ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు ఎం దు కు జరుగుతున్నాయని నిలదీశారు.

తెలంగాణలోనూ ఇంతకంటే దుర్భర పరిస్థితుల ఉండేవన్న ఆయన.. రైతు సం క్షేమ రాజ్యం కోసం తమ రాష్ట్రంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చామని కెసిఆర్ చెప్పారు. 24గంటల నాణ్యమైన విద్యుతును ఉచితంగా అందిస్తున్నామన్నారు. రైతులు ఏదైనా కారణంతో మరణిస్తే వారం రోజుల్లోనే రూ. 5లక్షల చెక్‌ను రైతు బీమా పథకం కింద అందిస్తున్నామని కెసిఆర్ వెల్లడించారు. రైతు బంధుతో పెట్టుబడి సాయంగా రైతును ఆదుకుంటున్నామని వెల్లడించారు. రైతులు పండించిన పం టను మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. తెలంగాణలో తీసుకొచ్చిన ఈ పథకాలు మహారాష్ట్రలో ఎందుకు లేవని ప్రశ్నించా రు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లలో 54 సంవత్సరా లు కాంగ్రెస్, 16 సంవత్సరాలు బిజెపి పాలించాయన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఏం సాధించాయని ప్రశ్నించారు.

రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆలోచనలు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. నువ్వు అంత తిన్నావంటే…. నువ్వు ఇంత తిన్నావంటూ తిట్టుకుంటున్నాయని విమర్శించారు. ఈ వెనుకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణమని మండిపడ్డారు. ఒకరు అంబానీ అంటే మరొకరు ఆదానీ అంటారని కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జనాభా లో 42శాతం రైతులే ఉన్నారన్నారు. వారు పండించిన పంట ను వారే అమ్ముకోవాలన్నారు. అప్పుడే రైతు రాజ్యం అవుతుందని కెసిఆర్ వెల్లడించారు. ఈ విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైనప్పుడు… తామే బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదని ఈ సందర్భంగా కెసిఆర్ హెచ్చరించారు.

మేకిన్ ఇండియా…జోకిన్ ఇండియాగా మారింది

మేకిన్ ఇండియా…. జోకిన్ ఇండియాగా మారిందని కెసిఆర్ మండిపడ్డారు. చిన్నచిన్న పట్టణాల్లోనూ చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని నిలదీశారు. మాంజాలు, పతంగులు, దైవ ప్రతిమలు, చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయన్నారు. దేశమంతా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నాందేడ్‌లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో లెక్కబెట్టారా ప్రశ్నించారు. ప్రధాని మన్‌కీ భారత్ పేరుతో ప్రజలను వంచిస్తున్నారని, ఇది రాజకీయం కాదు….జీవన్మరణ సమస్య అన్నారు. మరాఠ్వాడ గడ్డ ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చిందన్న ఆయన దేశంలో ఇప్పటికీ సరైన సాగునీరు, కరెంట్ లేదని అన్నారు.

నాయకత్వ మార్పు అవసరం

దేశంలో విప్లవాత్మక మార్పు అవసరం ఉందని కెసిఆర్ అన్నా రు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొం గడి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. ఇన్నేళ్లయినా చాలా గ్రామాల్లో తాగునీరు, సాగు నీరు లేదన్నారు. కరెంట్ సదుపాయం లేకుండా వందల గ్రామాలు చీకట్లో మ గ్గుతున్నాయన్నారు. వనరులు ఉన్నా ప్రభుత్వాల చేతకాని ప రిస్థితుల వల్లే ఇది జరిగిందన్నారు. అందుకే దేశ ప్రజలు నా యకత్వ మార్పును కోరుకుంటున్నారన్నారు. అది బిఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అ ని నినదించిన పార్టీ దేశంలో బిఆర్‌ఎస్ ఒక్కటేనని అన్నారు. ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. టిఎస్.. మహాకు రోటీ భేటీ బంధం ఉందన్నారు.

ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు

దళితబంధు దేశమంతా అమలు కావాల్సిన అవసరం ఉందని కెసిఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే దేశంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందజేస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఏటా 5లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు కానీ…..రైతులకు రూ.10వేలు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13నెలల పాటు రైతులు ఢిల్ల్లీ సరిహద్దుల్లో ధర్నా చేసినా ప్రధాని మోడీ కనీసం పలకరించలేదని కెసిఆర్ మండిపడ్డారు. ఢిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చెబితే ప్రధానికి చేతులు రాలేదని ధ్వ జమెత్తారు. ఫసల్ బీమా అంతా జూటా అని కెసిఆర్ విమర్శించారు. బిఆర్‌ఎస్ కిసాన్ సర్కార్ వస్తే రైతుల బతుకులు బాగుపడతాయన్నారు.

దేశమంతటా 24 గంటల విద్యుత్ ఇవ్వొచ్చు

దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్న కెసిఆర్… కేవలం బొగ్గుతోనే దేశమంతటా 24 గంటల విద్యుత్ ఇవ్వొచ్చునని అన్నారు. దేశంలో 301 బిలియన్ టన్నుల అపార బొగ్గు వనరులున్నాయన్నారు. రోజుకు 24 గంటలు విద్యుత్ అందించినా 125 సంవత్సరాల వరకు ఈ బొగ్గు వనరులు సరిపోతాయన్నారు. మహారాష్ట్రలోనే అపార బొగ్గు వనరులున్నాయి. కానీ కరెంటు ఉండదు. ఏదో లోపం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతా రావాల్సిన అవసరం ఉందన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

రైతులు చట్టాలు రాయాలి అమలు చేయాలి

మహారాష్ట్ర రైతులు తమ పొలాల్లో నాగలిని నడపడంతో పాటు చట్టాలు రాయడం అమలు చేయడం నేర్చుకోవాలని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు మీరు (రైతులు) ఇతరులు చట్టాలు రాయడానికి వీలుగా నాగలిని నడిపారన్నారు. కానీ ఇప్పుడు చట్టాలు రాయడానికి వాటిని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, బావుసాట్, బిఆర్ అంబేద్కర్, డాక్టర్ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రీబాయి ఫూలే వంటి మహామహులకు జన్మనిచ్చిన ఈ పవిత్ర భూమికి తాను ప్రణమిల్లుతున్నానని కెసిఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కొంతకాలం క్రితమే ఆవిర్భవించిందన్నారు. ఇంతకుముందు టిఆర్‌ఎస్ పేరుతో కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమై ఉండేదన్నారు. దేశ పరిస్థితులను అర్థం చేసుకున్నాక, దేశ భావజాలాన్ని మార్చాల్సిన అవసరాన్ని గుర్తించిన తర్వాత జాతీయ స్థాయిలో పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీగా మీ ముందుకు వచ్చామన్నారు.

రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు

ఒక రైతు తన కుటుంబాన్ని, పిల్లలను వదిలి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని కెసిఆర్ ప్రశ్నించారు. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టి, జీవితాన్ని ప్రసాదించే రైతన్నలు ఈ దేశంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు దీని వెనుకున్న మతలబేంటన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమన్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? అని నిలదీశారు. ఒక వైపు మన రైతులు చనిపోతుంటే, రంగు రంగాల జెండాలు. గంటలకు గంటలు రాజకీయ నాయకులు ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు అసెంబ్లీలో ప్రసంగాలు….పార్లమెంటులో ప్రసంగాలతో ఊదరగొడుతున్నా…. ఫలితం మాత్రం శూన్యమన్నారు.రైతుల పొలాల్లో ధాన్యం పండాల్సిన చోట, వారి ఆత్మలు తిరుగాడుతున్నాయన్నారు.

భారత్ బుద్ధిజీవుల దేశం

భారతదేశం బుద్ధిజీవుల (మేధావుల)దేశం, తెలివిలేని వారు దేశం కాదని సిఎం అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు మహామహ నాయకులను గద్దె దించారన్నారు. దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించినప్పుడు, నిషేధాలు విధించినప్పుడు మహానేత జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు ప్రజలు గొప్ప గొప్ప నాయకులను పెకిలి పారేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికే 75 సంవత్సరాల సుదీర్ఘ కాలం వేచి చూశామని…ఇక రైతుల సమయం వచ్చిందన్నారు. నేటి వరకు మనం హలాన్ని (నాగలిని) పట్టి, కలాన్ని వేరే వాళ్లకు అప్పగించామన్నారు. ఇక రైతులు కేవలం నాగలిని పట్టడమే కాదు కలాన్ని పట్టి, చట్టం చేసే అవకాశాలను కూడా పొందాలన్నారు. రైతుల కేవలం మాటలు, నినాదాలకే పరమితం కాకుండా శాసనసభ్యులుగా, ఎంపీలుగా ఎన్నికవ్వాలన్నారు. అప్పుడే రైతు రాజ్యం నిర్మితమవతుందన్నారు. ఈ చైతన్యం రావాలని కెసిఆర్ అభిలషించారు.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా పార్టీలు గెలుస్తాయి…. రాజకీయ నాయకులు గెలుస్తారని కెసిఆర్ అన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలవాలి…. రైతులు గెలవాలన్నారు.

రాజకీయాల్లో నాకు 50 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. ఎంఎల్‌ఎగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా ఎన్నో పదవులు చేపట్టానని అన్నారు. ఆ అనుభవంతో చెబుతున్నానని…. భారతదేశం అమెరికా కంటే ధనవంతమైన దేశమన్నారు. మన నాయకులు సమర్థవంతంగా పనిచేస్తే అమెరికా కంటే గొప్పగా ఎదగగలమన్నారు. భౌగోళింకంగా అమెరికా మన కంటే రెండున్నర రెట్లు పెద్దదన్నారు. కానీ వారి వద్ద వ్యవసాయ యోగ్యమైన భూమి 29 శాతం మాత్రమే ఉందన్నారు. చైనా మనకంటే ఒకటిన్నర రెట్లు పెద్దది అయినప్పటికీ వ్యవసాయ యోగ్యభూమి కేవలం 16 శాతం మాత్రమే ఉందన్నారు. మొత్తం ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే 50 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉందన్నారు. భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలుకాగా అందులో 41 కోట్ల ఎకరాలు భూమి వ్యవసాయ యోగ్యంగా ఉందన్నారు. ఇవి తాను చెబుతున్న గణాంకాలు కాదు స్వయంగా కేంద్ర ప్రభుత్వం తేల్చిన గణాంకాలన్నారు.

రిజర్వాయర్లు కట్టరు.. తగాదాలు తేల్చరు

భారత్ కంటే చాలా చిన్న దేశమైనా జింబాంబ్వేలో ప్రపంచంలోనే అతిపెద్ద దైన రిజర్వాయర్ ఉందని కెసిఆర్ వెల్లడించారు. దీని సామర్థ్యం 6533 టిఎంసిలన్నారు. అదే విధంగా ఆఫ్రికాలో నైలునదిపై, రష్యాలో అంగారా నదిపై, చైనాలో యాంగ్జే నదిపై, అమెరికాలో కొలరాడో నది పై 3000 నుండి 5000 టిఎంసిల రిజర్వాయర్లు రూపుదాల్చాయన్నారు. ఇంతటి సువిశాల భౌగోళిక స్వరూపం, పెద్దసంఖ్యలో జనా భా ఉండి అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొనే భారత్‌లో కనీసం మూడు, నాలుగు రిజర్వాయర్లైనా ఉండకూడదా? అని కెసిఆర్ ప్రశ్నించారు. ఒకవైపు రిజర్వాయర్లు కట్ట రు, మరోవైపు ట్రిబ్యునల్ తగాదాలు లేల్చరని మండిపడ్డారు. ప్రభుత్వం తల్చుకుంటే దేశంలోని ప్రతీ ఎకరం వ్యవసాయభూమికి సాగునీటిని సమకూర్చవచ్చునని అన్నారు.ట్రిబ్యున ళ్ళు, గ్రీన్ ట్రిబ్యునళ్ళు, ఎన్విరాన్ మెంట్ కమిటీ అంటూ వీటి నుంచి అనుమతులు వచ్చే వరకు మరో పది పదిహేనేళ్ళు. ఆ తర్వాత బడ్జెట్. బడ్జెట్ పాస్ అయిన తర్వాత ప్రాజెక్ట్… ఇలా చేసుకుంటూ పోతే తరాలు అవుతుందదన్నారు. ఈ పరిస్థిలో మార్పు రావాలన్నదే బిఆర్‌ఎస్ ప్రధాన లక్షమన్నారు. కిసాన్ సర్కార్ వస్తేనే దేశం పురోగమిస్తుందన్నారు.

బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే

బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు, కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున దళితబంధును అందిస్తామని కెసిఆర్ హామి ఇచ్చారు. రైతుబంధును ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. బిఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

మరో పది రోజుల్లో బిఆర్‌ఎస్ ఎన్నికల యాత్ర

మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ సొంతూరు శివనేరి నుంచి బిఆర్‌ఎస్ ఎన్నికల యాత్రను పది రోజుల్లో ప్రారంభిస్తుందని కెసిఆర్ వెల్లడించారు. దేశంలో కిసాన్ సర్కార్ రావాలని ప్రతిజ్ఞ చేసి ఈ యాత్రను ప్రారంభిస్తామన్నారు. ఈ యాత్ర మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి ప్రారంభం అవుతుందన్నారు. అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి బిఆర్‌ఎస్ వాహనాలు వస్తాయన్నారు. మహారాష్ట్రలో ఊరూరా…పార్టీ పక్షాన కిసాన్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. తాను కూడా ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బిఆర్‌ఎస్‌ను గెలిపించాలి కెసిఆర్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో గులాబీ గుర్తుపై ఒక్క బటన్ నొక్కండి….. దేశమంతా మారిపోతోందన్నారు. మహారాష్ట్రలో అనేక సమస్యలు ఉన్నాయని…. అవన్నీ పరిష్కారం కావాలంటే బిఆర్‌ఎస్‌ను గెలిపించి తీరాలన్నారు. మహారాష్ట్రలో ఇన్ని నదులున్నా నీటి కరువు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అందువల్ల గులాబీ జెండాను భుజాన వేసుకుని కదలిరావాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఊరురా కిసాన్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.

బిఆర్‌ఎస్‌లో చేరిన
వివిధ పార్టీల నేతలు
భారత్ రాష్ట్ర సమితి పార్టీలో నాందేడ్ వాసులు భారీ సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ కెసిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాందేడ్ జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, యువకులు భారీ సంఖ్యలో బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో బిజెపి, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలకనేతలు ఉన్నారు. మా జీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో సహా సరిహద్దు గ్రామాలకు చెందిన దాదాపు 40 గ్రామాలకు పైగా సర్పంచ్‌లు ఉన్నారు.

బాల్కసుమన్‌పైప్రశంసలు
నాందేడ్ సభలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై కెసిఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన సుమన్…. ప్రజల కోసం పని చేస్తున్నాడని కొనియాడారు. సుమన్ కాలేజీలో చదువుకున్నప్పుడు తెలంగాణ యుద్ధంలో తనతో పాటు పాల్గొన్నాడన్నారు. ఇందుకు గుర్తింపుగానే పార్టీ ఆయనకు ఎంపి టికెట్ ఇచ్చిందన్నారు. దీంతో 31సంవత్సరాలకే ఎంపీ అయిండన్నారు. నాయకులు ఎక్కడి నుంచే పుట్టుకురారని, మన మధ్యలో నుంచే పుట్టుకొస్తారన్నారు. అందుకు బాల్క సుమన్ నిలువెత్తు నిదర్శనమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News