Thursday, December 26, 2024

ఖాళీ అవుతున్న కాంగ్రెస్.. చేరికలతో ఫుల్ జోష్‌లో బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

లింగాల: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని, చేరికలతో ఫుల్ జోష్‌లో బిఆర్‌ఎస్ పార్టీ ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. లింగాల మండల కేంద్రంలోని 2వ వార్డుకు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాటాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థిత్లో లేరని అన్నారు. పూటకో మాటలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే పార్టీలోకి వలసలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మాకం తిరుపతయ్య, జిల్లా నాయకులు కెటి తిరుపతయ్య, సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, పిఎసిఎస్ మాజీ చైర్మెన్ వెంకట్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సుధీర్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ ఇరుకు ఎల్లేష్, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News