Sunday, January 19, 2025

ప్రచారంలో దూసుకుపోతున్న బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్‌లోని 25 అసెంబ్లీలు ఉండగా ఇందులో ఉప్పల్ నియోజకవర్గం మినహయించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బిఆర్‌ఎస్ పార్టీ సీట్లను కేటాయించింది. నగరంలోని గోషామహాల్ తప్పించి మిగిలిన స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌కు 51రోజుల ముందే టికెట్లను ఖరారు చేసింది. తన రాజకీయ వ్యుహా రచనతో ప్రతిపక్ష పార్టీలను చిత్తు చేయడంలో మంచిదిట్టగా పేరున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రటికటించడంతో ఈ అంశం ఆపార్టీకి ఎంతో కలిసివచ్చింది.

ఇప్పటీకే గత 45 రోజులుగా బిఆర్‌ఎస్ అభ్యర్థులు గ్రేటర్ వ్యాప్తంగా అన్ని పార్టీల కంటే ముందుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రేటర్‌లోఎంఐఎం గెలుపొందిన స్థానాలు మిగిలిన మిగిలిన స్థానాలను గెలుపొందడమే లక్షంగా ముందుకు సాగుతున్నారు. ఇదేక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు షెడ్యూల్ వెలువడే నాటికే తమ మొదటి దఫా ప్రచారాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. బిఆర్‌ఎస్ అభ్యర్థులంతా గడిచిన 10 ఏళ్ల కాలంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులతో పాటు అమలు చేసిన సంక్షేమ పథకాలను నగరవాసులకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

అదేవిధంగా మల్కాజ్‌గిరి స్థానాన్ని హనుమంతరావుకు కేటాయించిప్పటికీ ఆయన పార్టీకి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో టికెట్ ను ఆశిస్తున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంఛార్జ్ మర్రి రాజశేఖరరెడ్డి పేరు ఇంకా అధికారికంగా ఖరారు కానప్పటికీ గడిచిన ఆయన గత 20 రోజులుగా ఆ నియోజకవర్గంలో విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ తన ప్రచారం కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News