Friday, November 22, 2024

విద్యార్థులను కొట్టించిన ఘనత బిఆర్‌ఎస్‌దే : ఈటల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇచ్చారు అని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి పైన విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు. నిరసన చేసిన 10 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి ఇష్టానుసారంగా కొట్టారు. విద్యార్థులను కొట్టించిన ఘనత బిఆర్‌ఎస్‌కే దక్కుతుందని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో బకాయిలు ఎగకొట్టే రైతులనే ముద్ర తెలంగాణ రైతుల పైన పడిందన్నారు. రైతులను రుణ విముక్తులను చేసి కొత్త రుణాలను ప్రభుత్వం ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు ద్వారా ఏ ఒక్కరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం అందడం లేదన్నారు. హోం గార్డులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సిఎం హామీలను నెరవేర్చలేదన్నారు. బిల్లులు మంజూరు కాక సర్పంచులు, గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. బిఆర్‌ఎస్ మోసపు మాటలు నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నా అని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా..తన పదవీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర బిజెపి నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News