Monday, December 23, 2024

అభివృద్ధితోనే బీఆర్‌ఎస్ బలోపేతం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: పట్టణాల గ్రామాల అభివృద్ధితోనే బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం అయ్యిందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు గులాబీ గూటిలో చేరారు.

వారికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధి సంక్షేమంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయంతోపాటు ఉచిత ఎరువులు, విత్తనాలు అందజేస్తుందని అన్నారు. మహిళల సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మీలాంటి అనేక పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు.

నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సీఎంకేసీఆర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకొమురయ్య, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపసర్పంచ్ బీసగోని రమేష్, కరబూజ శ్రీనివాస్, గంగారం సర్పంచ్ మల్లారెడ్డి, ఉపసర్పంచ్ సుదాటి కరుణాకర్ రావు, బీఆర్‌ఎస్‌లో చేరిన కాసారపు పెద్ద లచ్చయ్య గౌడ్, బుర్ర వెంకన్న, బీసగోని రవి, పులి జనార్దన్, బుర్ర శంకర్, కాసరపు రాజయ్య, చంద్రయ్య, పొన్నం వీరయ్య, శ్రీధర్, మైసయ్య, తిరుపతి, ప్రభాకర్, కనకయ్య, శంకర్, శ్రీనివాస్,సాయి తేజ్, మనోజ్, రాజయ్య, కిరన్, శ్రీనివాస్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News