Wednesday, January 22, 2025

రైతులకు నిండుగా కరెంటు ఇచ్చే ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

చేర్యాల: దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు నిండుగా కరెంటు ఇచ్చే ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన మూడు గంటల కరెంటు సరిపోతుందన్న వ్యాఖ్యలపై ముస్త్యాల గ్రామం లోని రైతు వేదికలో ముస్త్యాల క్లస్టర్ కు సంబంధించిన రైతులతో సర్పంచ్ పెడతల ఎల్లారెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం కెసిఆర్ పరిపాలనలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటే ఓర్వలేని కాంగ్రెస్‌z బిజెపి నాయకులు కెసిఆర్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వీటన్నింటినీ తిప్పి కొట్టి ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాగా మరోసారి సిఎం కెసిఆర్‌ను గెలిపించాలని కోరారు. రైతుల క్షేమం గురించి నిరంతరం సిఎం కెసిఆర్ ఆలోచిస్తూ ఉంటాడని దానిలో భాగంగానే రైతు బీమా, రైతు బంధు తదితర పథకాలను తీసుకొని వచ్చి రాష్ట్రo అభివృద్ధి బాటలో పయనిస్తుంటే కాంగ్రెస్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంటు సరిపోదా అని అనడం, సంక్షేమ పథకాలకు అడ్డం పడడం చాలా విడ్డూరంగా ఉందని తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు అంతా అంతా కాదని రాత్రులు భావి వద్దకు వెళ్లి రైతన్నలు పాములు ,తేలు కుట్టి చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. మరోసారి కాంగ్రెస్ వస్తే రైతులకు కన్నీళ్లు కరువు తప్ప, ఇంకేవీ ఉండవని తెలిపారు. అనంతరం రైతులందరూ బిఆర్‌ఎస్ వైపు ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉల్లంపల్లి కరుణాకర్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, వైస్ ఎంపిపి తాండ్ర నవీన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీధర్ రెడ్డి, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రేపాక నాగేశ్వర్, పిఎసిఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, వీరన్నపేట సర్పంచ్ కొండపాక బిక్షపతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News