Monday, December 23, 2024

అభివృద్ధితో బీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలువురు నాయకులు, యువత బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, యువత బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారిలో ఎంబాడి తిరుపతి, బండి సదానందం, పనాస రాజేందర్, కారుకూరి రాజేశం, తిలక్, శ్రీనివాస్, లచ్చయ్య, రవీందర్, రాజేశం, వీరయ్య, శ్రీనివాస్, మొగిలి, ప్రశాంత్, లింగయ్య, బుచ్చయ్య, మధుకర్, మొండయ్య, రవి, రవీందర్‌తోపాటు పలువురికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం అనేక పథకాలను అమలు చేసి అర్హులైన వారికి అందించారన్నారు. రైతులకు నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రైతు వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ అవలంభిస్తున్నదని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులకు తగిన బుద్ది చెప్పాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు గొడుగు రాజకొమురయ్య, ఫ్యాక్స్ చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, సర్పంచ్ కాసం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ జెట్టి దేవెందర్, కన్వీనర్ మెడుదుల రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ వెలుతురు రమేష్, గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపసర్పంచ్ బీసగోని రమేష్, కరబూజ శ్రీనివాస్, బండి రమేష్, తమ్మిశెట్టి నాగభూషణం, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News