- Advertisement -
హైదరాబాద్: భారత రాజకీయాల్లో బిఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) కీలకపాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మోడల్, సిఎం కెసిఆర్ ఆలోచనలు ఈ దేశానికి అవసరమన్నారు. ఎనిమిదేండ్ల మోడీ పాలనలో హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో సాధ్యం కాలేదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. దేశం అన్ని రంగాల్లో దేశాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. ప్రపంచ దేశాల ముందు దేశ ప్రతిష్ట మంటగలిపారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -