Wednesday, January 22, 2025

నటుడు రఘుబాబు కారు ఢీకొని బిఆర్ఎస్ నాయకుడు మృతి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బిఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నల్లగొండ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ పట్టణ కార్యదర్శ సందినేని జనార్ధన్ రావు(48) వాకింగ్ కోసం వ్యవసాయ క్షేత్రాని బైక్ పై వెళ్తున్నారు. వ్యవసాయ క్షేత్రం వద్ద బైక్ యూటర్న్ తీసుకుంటుండగా నటుడు రఘుబాబు కారులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్నాడు. వెనక నుంచి బైక్ ను కారు ఢీకొట్టడంతో జనార్థన్ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలో అతడు చనిపోయాడు. జనార్దన్ రావు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News