- Advertisement -
మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, బిఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు అయ్యారు. గురువారం ఉదయం ఆయనను మాసబ్‌ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పోలీసుల విధుల అడ్డగింతపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొంత మందిపై బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది. ఈ
కేసులో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటి తలుపులు తెరవలేదు. మరోవైపు, బిఆర్ఎస్ కార్యకర్తలు ఆయన నివాసానికి భారీగా చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
- Advertisement -