Monday, December 23, 2024

కాంగ్రెస్ లోకి స్వామిగౌడ్..

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, మంచి పేరుండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేతలలను కలుస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో స్వామిగౌడ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ లోని నివాసంలో రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామిగౌడ్ కలిశారు. స్వామిగౌడ్, ఆయన కుటుంబసభ్యులతో చర్చించి పార్టీలో చేరమని ఆహ్వానించారు. చేరికపై స్వామిగౌడ్ ఎలా స్పందించారనే దానిపై స్పష్టత రాలేదు. కాంగ్రెస్ లోకి వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం స్వామిగౌడ్ కు శాసనమండలి ఛైర్మన్ పదివి ఇచ్చిన తర్వాత పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది.

దీంతో గతంలో ఆయన 2020లో బిఆర్ఎస్ నుంచి భారతీయ జనతాపార్టీలో చేరారు. అక్కడ నిలబడలేకపోయిన స్వామిగౌడ్ 2022లో తిరిగి బిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఇటీవల గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట సమితి ఓటిమి తర్వాత స్వామిగౌడ్ తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్ పిలుపుతో కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News