జవహర్‌నగర్ : తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, జవహర్‌నగర్‌కు చెందిన బిఆర్‌ఎస్ నాయకుడు బాగోజు లక్ష్మణ్‌చారి (57) గుండెపోటుతో మృతిచెందారు. ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేసరికి మృతిచెందాడు. బాలాజీనగర్‌లోని శివాజినగర్‌కు చెందిన లక్ష్మణ్‌చారి తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై పోరాటం చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టిఆర్‌ఎస్‌లో క్రీయాశీలకంగా పని చేశారు. లక్ష్మణ్‌చారికి భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
శుక్రవారం లక్ష్మణ్‌చారి మృతి చెందారన్న విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటానన్నారు. నగర మేయర్ కావ్య,డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్,బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజుతో పాటు కార్పొరేటర్లు,జవహర్‌నగర్‌కు చెందిన మలిదశ ఉద్యమ నాయకులు,వివిధ పార్టీలకు చెందిన నాయకులు నివాళులర్పించారు. వెంకటేశ్వర కాలనీలో గల హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.