- Advertisement -
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బిఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసహనంతో వాళ్లు మాట్లాడే మాటలు వింటుంటే నవ్వొస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు అక్కసుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ నేతల ప్రతి ప్రశ్నకు తమ వద్ద ఆన్సర్ ఉందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
- Advertisement -