Saturday, January 25, 2025

బిఆర్ఎస్ నేతలు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజనిర్ధారణ కోసం గాంధీ ఆసుపత్రికి సోమవారం వెళుతున్న భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) ఎంఎల్ఏ లను సిటీ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి టి. రాజయ్య, ఎంఎల్ఏ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎంఎల్ఏ డాక్టర్ మెతుకు ఆనంద్, ఎంఎల్ఏ మాగంటి గోపినాథ్ లను అరెస్టు చేశారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులు, శిశువులు మరణించడంపై నిజనిర్ధారణకు బిఆర్ఎస్ నాయకులు బయల్దేరగా అరెస్టయ్యారు. తాము ఆసుపత్రికి వెళుతుంటే ప్రభుత్వానికి భయమెందుకని బిఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం గురించి తెలుసుకోడానికి వెళుతున్న తమ నిజనిర్ధారణ బృందాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని బిఆర్ఎస్ నాయకుడు కెటిఆర్ ఆరోపించారు. ఆయన ఎక్స్ లో ఖండిస్తూ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News