Tuesday, December 24, 2024

కలెక్టర్‌పై దాడి కేసు.. అర్థరాత్రి కెటిఆర్ ఇంటి వద్ద కార్యకర్తల జాగరణ

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసు తెలంగాణలో హాట్ టాపిక్ మారింది. ఈ దాడి వెనుక కుట్ర జరిగిందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ముందస్తు ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దాడి చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో సహా 16మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. అయితే, రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో కెటిఆర్ పేరును కూడా చేర్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కెటిఆర్ ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు రావడంతో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు బుధవారం రాత్రి కెటిఆర్ ఇంటికి చేరుకున్నారు. కార్యకర్తలతోపాటు పలువు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ కెటిఆర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. అర్థరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కేటీఆర్ ఇంటి దగ్గరే కార్యకర్తలు జాగరణ చేశారు. హరీష్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ లు కూడా కెటిఆర్ ఇంట్లోనే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News