Tuesday, September 17, 2024

వరద బాధితులకు బిఆర్‌ఎస్ నేతల విరాళం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం వరద బాధితులకు బిఆర్‌ఎస్ నేతలు విరాళం ఇస్తున్నారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంపిలు ఒక నెల జీతం విరాళం ఇచ్చారని వివరించారు. సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌరస్తా లో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణి కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే, హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు.  బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం మేరకు నేతలు ఒక నెల జీతం విరాళం ఇస్తున్నామని ప్రకటించారు. ఖమ్మం వరదలపై కెసిఆర్ విచారం వ్యక్తం చేశారని, బాధితులకు సాయం అందించాలని కెసిఆర్ ఆదేశించారని, వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులకు సాయం చేసేందుకు బిఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడు ముందుగా ఉంటుందన్నారు. వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలకు సహాయ సహకారాలు బిఆర్‌ఎస్ పార్టీ అందిస్తోందని హరీష్ తెలియజేశారు. ఖమ్మం వరద బాధితులకు సిద్దిపేట వాసులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారని మెచ్చుకున్నారు. సిద్దిపేట నుంచి రేపు 6 లారీల్లో సామాన్లు పంపిస్తున్నామన్నారు. సహాయం చేయడంలో సిద్దిపేట వాసులు ఇంకా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అమర్ నాథ్ సేవా సమితి సేవలు దేశ వ్యాప్తంగా విస్తారించాయని, వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని ప్రశంసించారు. అమర్ నాథ్ సేవా సమితి సభ్యులు 13 సంవత్సరాలుగా మంచు కొండల్లో సేవలు అందిస్తున్నారని హరీష్ రావు కొనియాడారు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సిద్దిపేట నిలయంగా మారిందని, ఇపుడు ప్రకృతి కోసం మట్టి వినాయకులు పంచుతున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలని సకల కార్యాలకు విగ్నేశ్వరున్ని మొదటగా పూజిస్తామని, ఆకర్షణ కన్నా ఆధ్యాత్మిక ముఖ్యం అని మట్టి గణపతే మహా గణపతి అని తెలియజేశారు. ప్రకృతి ప్రేమిద్దామని మట్టి వినాయకులను పూజిద్దామని హరీష్ రావు పిలుపునిచ్చారు. మానవ సేవయే మాధవ సేవ ఆపదలో ఉన్న వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టేనని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News