Thursday, November 14, 2024

తాండూరు టిక్కెట్‌పై అందరి దృష్టి

- Advertisement -
- Advertisement -

తాండూరు : బిఆర్‌ఎస్ పార్టీలో టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేపట్టారు. తాండూరు టిక్కెట్‌పై అందరి దృష్టి సారించారు. తాండూరులో టిక్కెట్ కోసం ఎవరి ప్రయతాలు వారు ముమ్మరం చేశారు. సిటింగ్‌లకే టికెట్లు కన్ఫామ్ అని సిఎం కేసిఆర్ ఇప్పటికే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాండూరు అభివృద్ధ్ది కోసం పాటు పడుతున్న తనకే టిక్కెట్ వస్తుందని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పటికే తాండూరులో పార్టీ సమావేశాలు మండలానికోసారి నిర్వహించారు. పల్లె పల్లెకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కార్యక్రమాన్ని చేపట్టి అభివృద్ధ్దికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించారు.

తాండూరు పట్టణంలో ప్రతి వార్డుకు రూ.50లక్షల నుంచి కోటి వరకు నిధులు కేటాయించారు. ప్రధాన రోడ్ల నిర్మాణం చేపట్టడంతోపాటు మహబూబ్‌నగర్ నుంచి చించోలి వరకు మంజూరు అయిన రోడ్డు నిర్మాణంలో బాగంగా తాండూరు పట్టణంలోని బస్టాండ్ నుంచి సెంట్ మార్స్ హై స్కూల్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేయించారు. అయితే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాత్రం టిక్కెట్ నాదే నో డౌట్ అంటూ ప్రయత్నాలు ము మ్మరం చేశారు. కేసిఆర్, కేటిఆర్ కా ర్యక్రమాలకు హాజరవుతూ తాండూరులో ఆయన వర్గానికి జోష్ నింపుతున్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఓ పక్క పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయినట్లు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సోషల్ మీడియాలో, పత్రికల్లో ఎన్నో సార్లు కథనాలు వస్తున్నప్పటికి మహేందర్‌రెడ్డి ఎపుడు కూడా ఆ విషయాన్ని ఖండించలేకపోయారు.

ఇటీవల ప్రతి రోజు ఇంటింటికి తిరుగుతూ అన్ని పార్టీల నేతలను కలిశారు. పిఎంఆర్ ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం చేయడం వంటివి నిర్వహిస్తున్నారు.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇద్దరు టిక్కెట్ విషయంలో పోటీ పడుతున్న తరుణంలో మరో నాయకుడు ముందుకు వచ్చాడు. రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ఇటీవల అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూన్నారు. యువతలో జోష్ నింపుతూ ముందకు సాగుతున్నారు. తాండూరు నియోజకవర్గంలో ఎవరు పిలిచినా వాలిపోతున్నారు.

ఎవరైన చనిపోతే తన ట్రస్టు పేరుతో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం తాండూరులో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. తాండూరు అభివృద్ధికోసం తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు సేవ చేసేందుకు ముందుంటానని చెప్పుకొస్తున్నారు. బిసిలకు టిక్కెట్ ఇస్తే తనకే వస్తుందని శుభప్రద్ పటేల్ ఆశిస్తున్నారు. ఇలా తాండూరు బిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్ కోసం నేతలు ఎవరి ప్రయత్నం వారు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News