Saturday, January 18, 2025

కొడంగల్ ముఖ్యనేత బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొడంగల్ నుంచి బిఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ నాయకులు కొడంగల్ ఎంపిపి ముద్దప్ప, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిఎం కెసిఆర్ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను వెల్లడించడంతో సీటు రాని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో బిఆర్ఎస్ నుంచి సీటు రాని నేతలు బిజెపిలో చేరుతున్నట్టు సమాచారం. మిగతా జిల్లాలో బిఆర్ఎస్ నుంచి సీటు రానివారు కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నకిరేకల్ బిఆర్ఎస్ నేత మాజీ ఎంఎల్ఎ వేముల వీరేశం పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప్పల్ ఎంఎల్ఎ బేతి సుభాష్ రెడ్డికి బిఆర్ఎస్ నుంచి సీటు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన వర్గాలు ప్రకటించినట్టు సమాచారం. స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఎ రాజయ్య కూడా సీటు కేటాయించకపోవడంతో బోరున విలపించారు.

Also Read: కోటి వృక్షార్చన జయప్రదం చేయండి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News