Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ నేతలు కెటిఆర్, హరీశ్ రావులు వారి పద్ధతి మార్చుకోవాలి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి

మనతెలంగాణ/హైదరాబాద్:  బిఆర్‌ఎస్ నేతలు కెటిఆర్, హరీష్ రావులు వారి పద్ధతి మార్చుకోవాలని ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు అంటూ కెటిఆర్ మాట్లాడిన మాటలు ఆయన అహంకారానికి పరాకాష్ట అని ఆయన విమర్శించారు.

ప్రజలు తీర్పు ఇస్తే ప్రజాస్వామ్యబద్దంగా రేవంత్ రెడ్డి సిఎం అయ్యి రాష్ట్రంలో విప్లవాత్మక పాలన చేస్తున్నారన్నారు. ప్రజారంజకంగా, ప్రజా పాలన చేస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని ఆయన పేర్కొన్నారు. ప్రజాభిమానంతో సిఎంగా పని చేస్తున్న ముఖ్యమంత్రిపై కెటిఆర్ ఇలా అనుచితంగా మాట్లాడటం ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడుతారని ఆయన హెచ్చరించారు. హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హుందాతనం లేదని అనడం ఆయన అహంకారానికి పరాకాష్ట అని ఆయన విమర్శించారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ ప్రజాపాలన చేస్తూ హుందాగా వ్యవహారిస్తున్న రేవంత్ రెడ్డిని ఇలా అనడం పద్ధతి కాదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News