Thursday, April 3, 2025

HCU భూ వివాదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రికి బిఆర్ఎస్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)కు సంబంధించిన భూ వివాదం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వర్సిటి విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ భూముల వద్ద భారీగా పోలీసులు మోహరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరోవైపు, విద్యార్థులకు బిఆర్ఎస్ నేతలు అండగా నిలుస్తున్నారు.హెచ్ సియూలో నెలకొన్న భూ వివాదాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు.

బుధవారం HCU విద్యార్థులు, బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులతోపాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, K. R సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఢిల్లీ వెళ్లి.. కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిశారు. హెచ్ సియూకు సంబంధించిన భూమి వ్యవహారం, విద్యార్థులపై లాఠీ చార్జీపై ఆయనకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News