Monday, January 20, 2025

కారును పోలిన గుర్తులు తొలగించండి

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్ ఎంపిలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం న్యూ ఢిల్లీలోని బిఆర్‌ఎస్ ఎంపిల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. గతంలో ఇ లాంటి గుర్తుల వల్ల తమ పార్టీకి రావాల్సిన ఓట్లు కోల్పోయినట్లు ఎంపిలు తెలిపారు. ఈ విషయా న్ని గతంలో కూడా ఇసి దృష్టికి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇటీవల పలు గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించిన గుర్తుల్లో.. కారు గుర్తును పోలిన విధంగా ఉన్న వాటి విషయంలో పునఃసమీక్ష చేయాలని బిఆర్‌ఎస్ ఎంపీలు కోరారు. కేంద్ర ఎన్నికల సంఘంను కలిసిన వారిలో ఎంపి లు వెంకటేష్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ప్ర ధాన కార్యదర్శి సోమ భరత్
ఉన్నారు.

కారును పోలిన గుర్తులు రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులు బిఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా పరిణమించాయి. సాధారణ ఎన్నికల మొదలు ఉప ఎన్నికల వరకు ఈ గుర్తుతో తమ పార్టీకి పడాల్సిన ఓట్లు ఆయా గుర్తులు కలిగిన అభ్యర్థులు, పార్టీలకు పడుతున్నాయాని బిఆర్‌ఎస్ నేతల వాదన. ఈ గుర్తును ‘ఫ్రీ సింబల్స్’ జాబితా నుంచి తొలగించాలంటూ పదేండ్ల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.చివరకు 2011 నవంబరులో ఇసి ఈ గు ర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే జాబితా నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నది. 2018 తర్వాత మళ్లీ ఈ గుర్తు వివాదానికి దారితీసింది. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక మొ దలు తాజాగా ముగిసిన మునుగోడు బై ఎలక్షన్ వరకు ఈ గుర్తుతో బిఆర్‌ఎస్‌కు ఓట్లు తగ్గాయి. అప్పటివరకూ స్వతంత్ర అభ్యర్థులకు మాత్రమే ఇసి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించగా, తాజా గా ఈ గుర్తును యుగతులసి అనే పార్టీకి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కామన్ సింబల్‌గా కేటాయిస్తూ ఇసి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఈ గుర్తు తరఫునే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

పలు ఎన్నికల్లో రోడ్డు రోలర్‌కు పడిన ఓట్లు
గతేడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికలోనూ రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన యుగతులసి అభ్యర్థి శివకుమార్‌కు గుర్తుకు 1,880 ఓట్లు పడ్డాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక (2020 నవంబర్)లో బిఆర్‌ఎస్ అభ్యర్థి 1,079 ఓట్లతో ఓడిపోగా రోటీ మేకర్ గుర్తుతో పోటీచేసిన బండారు నాగరాజు (ఇండిపెండెంట్)కు 3,510 ఓట్లు పోల్ అయ్యాయి. అలాగే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక (2019 అక్టోబర్)లో రోటీమేకర్ గుర్తుతో పోటీచేసిన సుమన్‌కు 2,697 ఓట్లు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌లో రోడ్డు రోలర్ గుర్తుకు 4,330 ఓట్లు, సిర్పూర్‌లో 4,039, మునుగోడులో 3,569, డోర్నకల్లో 4,117, హుజూరాబాద్‌లో 2,660, భూపాలపల్లిలో చపాతీ మేకర్ గుర్తుతో పోటీచేసిన మంతెన సంపత్‌కు 4,787 ఓట్లు, దేవరకొండలో రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన రమావత్ నాయక్ 3,247 ఓట్లు, గజ్వేల్‌లో ఇదే గుర్తుతో పోటీ చేసిన కంటె సాయన్న (థర్డ్ ప్లేస్) 3,353 ఓట్లు చొప్పున ఓట్లు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News