మన తెలంగాణ /సిటీబ్యూరో :జీహెచ్‌ఎంసి లో కార్పొరేటర్ల రాజకీయాలు రసవత్తరం గా మారాయి. నగర మేయర్‌పై అవిశ్వాసం పె ట్టబోతున్నారనేది ఇప్పుడు గ్రేటర్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారి ంది. ఓ వైపు నగర మేయర్‌పై అవిశ్వాసంపై బీఆర్‌ఎ స్ నాయకులు చర్చించకుంటుండగా… మ రో వైపు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు నిజంగా మే యర్‌పై అవిశ్వాసం పెడితే మేము బేషరతు గా అవిశ్వాసానికి మద్దతిస్తామంటూ బీజెపి కి చెందిన కొందరు కార్పొరేటర్లు ప్రకటించా రు. ఇంకోవైపు అవిశ్వాసం పెడితే ఓడుతారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా… బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, నగరంలో కీలక రాజకీయనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో బిఆర్‌ఎస్ నేతల రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి మేయర్‌పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి గల అవకాశాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రస్తుతం అవిశ్వాసం పెడితే.. ఎవరి బలమెంత..? ఎవరు ఏమి చేశారనేది నగర ప్రజలకు తెలుస్తుందని, తద్వారా పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు వచ్చే అవకాశాలుంటాయని, వాటన్నింటిని రానున్న ఎన్నికల్లో ప్రజల ముందుకు తీసుకెళ్ళొచ్చని పార్టీ నేతలు అభిప్రాయ పడినట్లు తెలిసింది.
కాగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని తాము పలుమార్లు ప్రజలకు వివరిస్తూ వస్తున్నామని, ఇప్పుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్.. తాము కాంగ్రెస్‌కు వ్యతిరేకమని చెప్పాలంటే మేయర్‌పై అవిశ్వా స తీర్మానం ప్రవేశపెట్టాలని బిజెపి కార్పొరేటర్ శ్రావణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రె స్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పనిచేస్తాయనే దానికి మేయర్ అవిశ్వాస తీర్మానంతో తేటతెల్లమవుతుందనీ, ప్రజల కు ఎవరెవరు ఏ మేరకు నిజాయితీగా వ్యవహరిస్తారో ఈ తీర్మానంతో వెల్లడవుతుందని శ్రావణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసిలో అధికారికంగా ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే, బీఆర్‌ఎస్, బీజెపిల నుంచి పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి చేరారు. అయితే, అవిశ్వాసం తీర్మానం విషయం ప్రచారంలోకి రాగానే పలువురు పార్టీ మా రిన వారు జిహెచ్‌ఎంసి చట్టం తెలిసిన వారిని సంప్రదిస్తూ.. అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఎలా జరుగుతుందనేది వాకబు చేస్తున్నా రు.