Wednesday, January 22, 2025

మొక్కలు నాటిన బిఆర్‌ఎస్ నేతలు

- Advertisement -
- Advertisement -

బోయినపల్లి వినోద్‌కుమార్ మాధవి, జోగినపల్లి సంతోష్ కుమార్ రోహిణిల పెళ్లి రోజు సందర్భంగా…

హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాధవి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రోహిణి పెళ్లిరోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బొయినిపల్లి మండలం కుదురుపాక గ్రామంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు ఎంపిపి పర్లపెల్లి వేణుగోపాల్ జెడ్‌పిటిసి ఉమ కొండయ్య మాజీ డిసిఎంఎస్ చైర్మన్, బిఅర్‌ఎస్ జిల్లా నాయకులు అనుముల భాస్కర్ మొక్కలు నాటారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాధవి, పర్యావరణ పరిరక్షణ భావితరాలకు కోసం బాసటగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ రోహిణి పెళ్లిరోజు పురస్కరిం చుకొని కుదురుపాక గ్రామంలో మొక్కలు నాటి బిఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నాగుల నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో హైస్కూల్, ప్రైమరీ విద్యార్థి విద్యా ర్థులకు నోట్ బుక్స్, పెన్‌లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపిపి నాగయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనా రాయణ రెడ్డి రైతు సమితి లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధాకర్‌రావు, సింగిల్ విండో చైర్మన్ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News