Wednesday, January 22, 2025

సిఎంగా కెసిఆర్ హ్యాట్రిక్ సాధించాలని తిరుపతిలో మొక్కులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సిఎంగా కెసిఆర్ హ్యాట్రిక్ సాధించి, దేశంలో బిఆర్‌ఎస్ విస్తరణ జరగాలని కోరుతూ బిఆర్‌ఎస్ నేతలు తిరుపతి అలిపిరి పాదాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి బిఆర్‌ఎస్ నేత ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ శ్రేణులు తిరుపతి నుండి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన నడచి వెళ్లారు.

ఈ సంధర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఎపిలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీ బలోపేతమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ తిరుపతి జిల్లా నాయకులు కల్లూరు బాలసుబ్రమణ్యం, బెల్లంకొండ సురేష్, జ్ఞానేశ్వరి, సాయి కుమార్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News