Monday, December 23, 2024

ఎల్‌ఆర్‌ఎస్‌పై బిఆర్‌ఎస్ భగ్గు

- Advertisement -
- Advertisement -

ఉచితంగానే ఎల్‌ఆర్‌ఎస్
చేయాలంటూ బిఆర్‌ఎస్ శ్రేణుల
ధర్నాలు అన్ని నియోజకవర్గాల
కేంద్రాల్లో హోరెత్తిన నినాదాలు
నేడు జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు,
ఆర్‌డిఒలకు వినతిపత్రాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : గతంలో ఎల్‌ఆర్‌ఎస్ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు మాట తప్పడంపై బిఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. నాడు అడ్డగోలుగా మాట్లాడిన నేటి కాం గ్రెస్ మంత్రులు, ఇప్పుడు నో రు ఎందుకు వి ప్పడం లేదని ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను నిరసిస్తూ బి ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు.

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బిఆర్‌ఎస్ పార్టీ నాయకలు, కార్యకర్తలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ కార్యాలయాల వద్ద, నియోజకవర్గ కేంద్రాలలో బిఆర్‌ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. నాడు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడుతామని నినదించారు. ఎల్‌ఆర్‌ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు..ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్‌డిఒలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News