Monday, December 23, 2024

3 గంటలు.. నిరసన మంటలు

- Advertisement -
- Advertisement -

రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం

పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ నేతలు రోడ్లపైకి వ చ్చారు. మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, లోకల్ లీడర్లంతా పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అ ధికారంలోకి రాకముందే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెట్ట్డుకుందని మండిపడ్డారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చా లు’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ పోరు తీవ్రత రం చేసింది. రేవంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ నేతలంతా ఎక్కడికక్కడ ప్రెస్‌మీట్‌లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తే, బుధవారం రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేశారు. ఖబడ్దార్ రేవంత్ అంటూ హెచ్చరికలు చేశారు. ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వీళ్లంతా రైతు వ్యతిరేకులని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధా వద్ద ఎంఎల్‌సి కవిత ధర్నాకు దిగారు.

సోమాజిగూడలోని ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పాల్గొని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ నేతలు, కార్పొరేటర్లు పాల్గొని తమ నిరసన గళాన్ని విప్పారు. రేవంత్‌కు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తే కాంగ్రెస్‌కు వచ్చిన సమస్య ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో ఆయా జిల్లాల మంత్రులు, ఇతర సీనియర్ నేతలు ధర్నాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఊళ్లలోకి రానియొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ధరణి రద్దు చేస్తామని, ఇప్పుడు ఉచిత విద్యుత్ తీసేస్తామంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని అలాంటి వారిని నమ్ముకంటే మరోసారి సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎంఎల్‌సి కవిత బుధవారం ఉదయం ట్వీట్ కూడా చేశారు. నేరుగా రాహుల్ గాంధీకే ట్యాగ్ చేస్తూ రేవంత్ చేసిన కామెంట్స్‌పై నిలదీశారు. అసలు తెలంగాణ రైతులపై అక్కసు ఎందుకు? అని నిలదీశారు.

అంతకు ముందు ట్వీట్ చేసిన కెటిఆర్ సిఎం కెసిఆర్ నినాదం మూడు పంటలు అయితే, కాంగ్రెస్ విధానం మూడు గంటలని, బిజెపి విధానం మతం పేరిట మంబటలు అని విరుచుకుపడ్డారు. మూడు పంటలు కావాలా మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? కేసీఆర్ సర్కార్ నిరంతరం కరెంటు అందిస్తుంటే కాంగ్రెస్ కడుపు మండుతోందని.. ఆ పార్టీకి బుద్ధిచెప్పాలని బిఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని ట్విట్టర్‌లో విమర్శించిన హరీశ్‌రావు రైతులకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్‌కు ఎన్నికల్లో షాక్ ఇవ్వాలన్నారు. రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ అధిష్ఠానం రైతులకు క్షమాపణ చెప్పించాలని మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. 3 గంటల కరెంటు ఇస్తామని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు.

రైతులకు కాంగ్రెస్ మొదటి శత్రువని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరిలో ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ మన్నె క్రిశాంక్ నేతృత్వంలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఐనవోలులో వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేశ్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో జాతీయ రహదారిపై స్థానిక ఎంఎల్‌ఎ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా చిన్నపెండ్యాల జాతీయ రహదారిపై బిఆర్‌ఎస్ శ్రేణులు రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎంఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయం 9 ఏళ్లల్లో అద్భుత ప్రగతిపథంలో నడుస్తుంటే కాంగ్రెస్ నేతల కడుపు మండుతోందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సిద్దిపేటలో నిరసన ప్రదర్శన నిర్వహించిన అధికార పార్టీ కార్యకర్తలు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బిఆర్‌ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం రేవంత్‌కు ఇష్టం లేదని చంద్రబాబుకు పట్టిన గతే రేవంత్‌కు, కాంగ్రెస్‌కు పడుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.

కరీంనగర్‌లో బిఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. రైతులకు మూడు గంటలే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న కాంగ్రెస్‌ను 3 స్థానాల్లోనే గెలిపించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రేవంత్‌రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. రైతాంగ సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న కపట ప్రేమ రేవంత్ వ్యాఖ్యలతో బయటపడిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నారాయణపేట జిల్లా మరికల్‌లో స్థానిక ఎంఎల్‌ఎ రాజేందర్‌రెడ్డి బిఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఏమైనా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప, ఉచిత విద్యుత్ సరఫరా అవసరం లేదంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు సరైంది కాదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. యాదాద్రి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరులో బిఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా రేవంత్‌రెడ్డి తీరు ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత విమర్శించారు.

రేవంత్ దిష్టిబొమ్మకు శవయాత్ర… స్వయంగా పాడెమోసిన ఎంఎల్‌ఎ రసమయి
కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో కూడిన పాడెను స్వయంగా ఎంఎల్‌ఎ రసమయి మోశారు. బిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి శవయాత్ర నిర్వహించి, రాజీవ్ రహదారిపై రేవంత్ దిష్టిబొమ్మను ఎంఎల్‌ఎ రసమయి దగ్ధం చేశారు.

గోడలకు సున్నాలు వేసిన రేవంత్‌కు రైతుల కష్టాలు ఏం తెలుసు?: పువ్వాడ 
పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. బుధవారం ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం మంచుకొండలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, గోడలకు సున్నాలు వేసిన రేవంత్‌కు రైతుల కష్టాలు ఏం తెలుసునని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు పవర్ ఇస్తే రైతులకు పవర్ కట్ అంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాక ముందే వాళ్ల కడుపులో ఏం వుందో స్పష్టం అయ్యిందని పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు అందరికీ తెలుసునని. కెసిఆర్ వచ్చిన తర్వాతే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారని పువ్వాడ ప్రశంసించారు.

గతంలో ఎరువుల లారీలు ఎలా లూటీ అయ్యాయని నిలదీశారు. విత్తనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్ల మీద చెప్పులు పెట్టిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కెసిఆర్ రైతు బాంధవుడని, పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే అది ఆయన వల్లేనని తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పాతాళంలోకి దిగిపోయిందని, చంద్రబాబు ఏజెంట్లు ఉత్తర నాయకులు పిసిసి అధ్యక్షులుగా వున్నారంటూ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News